బాలకృష్ణపై హీరోయిన్ ఫైర్.. పనికిమాలిన పని చేసినా తప్పులేదంటూ ఘాటు వ్యాఖ్యలు
బాలకృష్ణ , అంజలి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా బాలయ్య విచ్చేశారు. ఈ సమయంలో హీరోయిన్ అంజలిపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఓవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్టేజ్‌పై అంజలిని బాలయ్య పక్కకి నెట్టడం విమర్శలకి దారి తీసింది. గతంలో అంజలి బాలకృష్ణతో కలిసి నటించారు. దీంతో ఆ చనువుతో అంజలిని నెట్టి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అయింది.
దీనిపై ఇప్పటికే విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ అంజలి స్వయంగా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. బాలకృష్ణ అలాంటి వ్యక్తి కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన మరో ఫొటో తెర మీదకు వచ్చింది. అంజలి స్టేజ్‌పైకి వెళ్తున్న సమయంలో తన లెఫ్ట్ హ్యాండ్‌తో ఆమె వెనుక భాగంలో బాలకృష్ణ టచ్ చేశారు. ఆ సమయంలో అంజలి కూడా స్మైల్ ఇస్తూనే వెల్లిపోయింది.

ఈ ఘటనపై హీరోయిన్ రిధి డోగ్రా స్పందించారు. ఆమె బాలయ్యపై ఓ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య వీడియోను షేర్ చేస్తూ అతను ఆ మహిళను కించపరిచేలా వ్యవహరించినప్పటికీ ఆమె నవ్వుతోంది. ఎందుకంటే బాగా డబ్బు, పేరున్న మగాళ్లు పనికిమాలిన పని చేసిన ఈ ప్రపంచం తప్పుపట్టదు. సమాజంలోని జనాలు అలాంటి పురుషులు ఏం చేసినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవేళ ఈ ఘటనపై ఆమె కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని రాసుకొచ్చింది. ఈ ప్రస్తుతం హీరోయిన్ రిధి డోగ్రా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications