బాబాయ్ హోటల్ లో టిఫిన్ చేసిన విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం సైంథవ్. హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య తదితరులు నటించారు. జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. వాస్తవానికి డిసెంబరు 22నే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఆరోజు సలార్, 21న డంకీ ఉండటంతో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ పట్టణాల్లో సెకండ్ సింగిల్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2.00 గంటలకు గుంటూరుకు సమీపంలోని వీవీఐటీ కళాశాలలో, సాయంత్రం 5.00 గంటలకు విజయవాడకు సమీపంలోని కేఎల్ యూ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.

saindhav team promotional events in guntur and vijayawada

ఈ సినిమాను సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని చిత్ర బృందం దర్శించుకుంది. తర్వాత సిటీబస్సులో ప్రయాణించారు. విజయవాడలోని బాబాయ్ హోటల్ లో అల్పాహారం తీసుకున్నారు. బస్సులో ఉన్న సైంధవ్ టీం పొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో కూడా వైరల్ గా మారింది. సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సంగీతం సంతోష్ నారాయణన్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+