సాయిపల్లవికి సర్జరీ?
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది సాయిపల్లవి. మళయాళం పరిశ్రమ నుంచి ఫిదా సినిమాద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ సినిమాలో తన నటనద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత అమ్మడు రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హీరోయిన్లంతా అందాల ఆరబోతకు ముందుకు వస్తుంటే కేవలం నటనద్వారా మాత్రమే నిఖార్సైన అవకాశాలను దక్కించుకుంటోంది. లేడీ పవర్ స్టార్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన ఒక సినిమా, తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.
నాగచైతన్య- చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి మొదటి హీరోయిన్గా ఎంపికైంది. తాజాగా ఆమె ఓ చిన్న సర్జరీ చేయించుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాళ్లల్లో చిన్న సమస్యవల్ల సరిగా నడవలేకపోతున్నారని, డ్యాన్స్ కూడా సరిగా చేయలేకపోతోందని, చిన్న మైనర్ సర్జరీ చేయించుకుంటే అంతా బాగుంటుందని వైద్యులు చెప్పడంతో అమ్మడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త పరిశ్రమలో వైరల్ గా మారింది.

తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలో సాయిపల్లవి జన్మించారు. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో పేరులో ముందుగా సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె, ఈమె చెల్లెలు పూజ కవల పిల్లలు. కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి వేదికల మీద నాట్యం చేసేది.
ఎనిమిదో తరగతి లో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది. ఈటీవీలో ఢీ లాంటి డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది.












Click it and Unblock the Notifications