నాగచైతన్యే కరెక్ట్... విడిపోయిన తర్వాత సమంత ఏం చేసిందో తెలుసా?
అక్కినేని యువ నటుడు నాగచైతన్యను ఆరు సంవత్సరాలు గాఢంగా ప్రేమించిన సమంత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ జంట కొన్నాళ్లు చక్కగా కాపురం చేశారు. ఆ తర్వాత అనుకోకుండా ఓరోజు తాము విడిపోతున్నట్లు ప్రకటించి సినీ పరిశ్రమ మొత్తానికి షాక్ ఇచ్చారు. విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి జీవితం వారిదే అయింది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. ఎంతోమంది ఎన్నోరకాలుగా విశ్లేషించినప్పటికీ వీరిద్దరు మాత్రం వాస్తవం వెల్లడించలేదు.
అత్యంత విలువైన ఉంగరాన్ని చెడగొట్టింది
నాగచైతన్యతో పెళ్లికి ముందు నిశ్చితార్థం జరిగినప్పుడు అక్కినేని కుటుంబం రూ.50 లక్షల విలువతో అత్యంత ఖరీదైన ఉంగరాన్ని తయారుచేయించింది. దీన్ని నిశ్చితార్థం సందర్భంగా నాగచైతన్య సమంత వేలికి తొడిగాడు. విడాకుల తర్వాత ఇటీవలే ఆ ఉంగరాన్ని సమంత మార్చేసింది. దాన్ని చెడగొట్టి నెక్లెస్ గా మార్చుకుంది. కొన్ని కొన్ని సినిమా వేడుకలకు, ఇతర వేడుకలకు హాజరయ్యే సమయంలో ఈ నెక్లెస్ ను ధరించివచ్చేది. ఏదైనా వస్తువును ఎవరైనా కొంత జ్ఞాపకంగా ఉంచుకుంటారు. సమంత మనసుకు అంత కష్టం వచ్చేలా నాగచైతన్య ఏం చేశాడు? ఆ ఉంగరాన్ని చెడగొట్టేంతగా మీమధ్య ఏం జరిగింది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. పెళ్లి సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న గౌన్ ను కూడా మార్చేసింది.

అవార్డుల ప్రదానోత్సవానికి గౌను డిజైన్ ను మార్చింది
2024లో సినిమా అవార్డుల ప్రయివేటు కార్యక్రమానికి హాజరైనప్పుడు మార్చిన గౌనును ధరించి వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చింది. నాలుగు సంవత్సరాలు కలిసి మెలిసి జీవించిన ఈ జంట విడాకుల తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. సమంత మాత్రం ఒంటరిగానే ముంబయిలో ఎక్కువగా నివసిస్తోంది. దర్శకుడు రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయికానీ అటువంటిదేమీ లేదంటూ సమంత అభిమానులు కొట్టేస్తున్నారు. చివరకు సమంత ఒంటరిగానే మిగిలిపోతుందా? లేదంటే రెండో వివాహం చేసుకుంటుందా? అనేది తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడాల్సిందే.












Click it and Unblock the Notifications