నాగచైతన్యతో గేటు దగ్గర సన్నివేశం మర్చిపోలేను: సమంత

సమంత ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేస్తోంది. దీంతోపాటు తన సొంత బ్యానరు ట్రూలాలాపై మా ఇంటి బంగారం సినిమా తీస్తోంది. ఇందులో తానే హీరోయిన్ గా నటిస్తోంది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో హీరోగా తక్కువ ఇమేజ్ ఉన్న నటుణ్ని ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చాలా తక్కువగానే ఉంటోంది. ఎక్కువ రోజులు ముంబయిలోనే గడుపుతోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధి సోకడంతో చికిత్స కోసం విదేశాలకు వెళ్లింది. రెండు సంవత్సరాలకు సినిమాలకు విరామం ఇవ్వడంతో సినిమాల్లోకి తీసుకోవడానికి హీరోలు, దర్శకులు ముందుకు రావడంలేదు.

మార్గనిర్దేశం చేసేవారు లేక
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత తన తొలి తెలుగు చిత్రం ఏమాయ చేశావే గురించి చెప్పింది. ఆ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని తాను మరిచిపోలేనంది. ముందుగా హీరోతో గేటు దగ్గర మీటింగ్ సన్నివేశం మాత్రం గ్రేట్ అంది. దర్శకుడు గౌతమ్ మీనన్ తో పనిచేయడం ఎంతో సౌలభ్యంగా ఉంటుందని, తనకు ఎలాంటి నటన కావాలనేది ఆయన నటీనటుల నుంచి బాగా రాబట్టుకొంటారని చెప్పింది. ఏమాయ చేశావే సినిమాకు ముందు కొన్ని తమిళ సినిమాలు చేసినప్పటికీ భాష రాకపోవడంవల్ల సన్నివేశాలు అర్థం కాలేదని, అంతా అయోమయంగా అనిపించేదని, తనకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవడంవల్లే ఇలా జరిగిందన్నారు. కొన్ని సినిమాల్లో తన నటన చాలా దారుణంగా ఉంటుందన్నారు.

Samantha comments on her first telugu movie ye maya chesave and hero nagachaitanya

రెండో వివాహం చేసుకునే ఉద్దేశం లేదు
ఏమాయ చేశావే సినిమా తర్వాత సమంతకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగులో వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేసి నెంబర్ వన్ హీరోయిన్ అయ్యారు. స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత, రెండున్నర సంవత్సరాల నుంచి ఎటువంటి సినిమా చేయనప్పటికీ ఇప్పటికీ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత నిలుస్తున్నారు. దీపికా పడుకునే, అలియాభట్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టేశారు. నాగచైతన్య.. శోభితను వివాహం చేసుకోవడంతో సమంత వేరే ఒక దర్శకుడితో సహజీవనం చేస్తోందని, త్వరలోనే పెళ్లిచేసుకుంటారూ వార్తలు వచ్చాయికానీ వాటిని సమంత కొట్టేసింది. తనకు రెండో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+