రెండో పెళ్లిపై సమంత బిగ్ అప్డేట్..ఆ దర్శకుడితో ఫిక్స్..?
తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య , సమంత కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఏం మాయ చేశావే, మనం, ఆటో నగర్ సూర్య, మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు.
పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత ఒంటరికి ఉంటున్నారు. ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. తాజాగా సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌లో ఓ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

ఇటీవల సమంత ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఆమెకు ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది ఆడియో మెసేజ్. అయినప్పటికీ సమంత ఆ ఆడియో మెసేజ్ ఓపెన్ చేసి వినేసింది. అంతేకాదు ఆనందంతో సిగ్గు పడుతూ కనిపించింది. దీంతో ఆ దర్శకుడే సమంతకు మెసేజ్ ఉంటారని అంతా భావిస్తున్నారు. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదు. ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications