నాగచైతన్య-శోభిత ఒకటవుతున్న వేళ... ఆ ఇద్దరి వల్ల ఏంత ఏడ్చానో: సమంత

తెలుగులో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్న సమంత నటించిన హనీబన్నీ వెబ్ సిరీస్ ఈనెల ఏడోతేదీన అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించాడు. హనీబన్నీ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న తర్వాత సమంత కొన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తోంది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సినిమాలకు ఏడాదిన్నరకు పైగా విరామం ప్రకటించింది. ఇది తన జీవితంలో చాలా తప్పైందని బాధపడుతోంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంలేదని బహిరంగంగానే చెబుతోంది.

బాగా ఏడ్చానని మేనేజర్ కు చెప్పింది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత హనీ బన్నీ సిరీస్ డైరెక్టర్ల వల్ల షూటింగ్ లో బాగా ఏడ్చానని తెలిపింది. తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో తాను నటించిన సినిమాల్లో రోజుకు రెండు లేదంటే మూడు సన్నివేశాలు తీసేశారని, కానీ రాజ్ అండ్ డీకేలు మాత్రం వాటిని గంటలోనే తీసేవారని చెప్పారు. తాను మేనేజర్ కు ఫోన్ చేసి తనవల్ల కావడంలేదని ఏడ్చేశానని, తర్వాత్తర్వాత వారిద్దరి మేకింగ్ కు తాను అలవాటు పడినట్లు సమంత వెల్లడించారు. తాను బాగా ఏడ్చేశానని సమంత కామెంట్ చేయడంవల్ల నాగచైతన్య-శోభిత ఒకటి కాబోతున్నవేళ ఆ విషయంమీద ఏడ్చేసిందేమోనని తాము కంగారు పడినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో చూడముచ్చటైన జంటగా ఉన్న నాగచైతన్య-సమంత విడిపోవడం మాత్రం మాటలకు అందడంలేదంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Samantha suffered from honey bunny web series directors raj and dk

ఆలోచించి నిర్ణయం తీసుకుంటా
తన సొంత బ్యానరులో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. దీని తర్వాత ఓ సిరీస్ ఒప్పుకుంది. అయితే హనీబన్నీకి వచ్చిన ఫలితాన్ని బట్టి, అందులోని బోల్డ్ సన్నివేశాలను బట్టి భవిష్యత్తులో ఇటువంటివి చేయాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటానని సమంత చెబుతోంది. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ తోపాటు హనీబన్నీలో వరుణ్ ధావన్ తో నటించిన బోల్డ్ సన్నివేశాలపై సమంతపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. వీటన్నింటినీ ఆలోచించి సినిమాల్లో ఐటం సాంగ్స్ కూడా చేయడం మానుకున్నట్లు చెప్పింది. భవిష్యత్తులో ఇంకా ఏమేం నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+