మైలేజ్ మాత్రమే కాదు.. బెస్ట్ రీసేల్ వాల్యూ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే!
Cars With Best Resale Value: కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు దాని ధర, మైలేజ్, ఫీచర్లతో పాటు బ్రాండ్ ఇమేజ్, ఆ కారుకు భవిష్యత్తులో లభించే రీసేల్ వాల్యూ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. కొన్నేళ్లు కారును వాడిన తర్వాత కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మంచి రీసేల్ వాల్యూను అందించే కారును కొనుగోలు చేస్తే మనకు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.10 లక్షల బడ్జెట్లో(ఆన్-రోడ్) బెస్ట్ రీసేల్ వాల్యూ పొందే టాప్ 5 కార్ల గురించి తెలుసుకుందాం.
1.మారుతి సుజుకి స్విఫ్ట్: రూ.6.82 లక్షల నుంచి రూ.10.38 లక్షలు
మారుతి స్విఫ్ట్ ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్. కొత్త జనరేషన్ స్విఫ్ట్‌లో అందించిన 1.2-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్ అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. మారుతి సుజుకికి చెందిన విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, స్పేర్ పార్ట్స్ లభ్యత ఈ కారుకు మార్కెట్లో డిమాండ్ ఉండేలా చేస్తాయి. ఎంత కాలం వాడినా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో స్విఫ్ట్‌కు మంచి రీసేల్ లభిస్తుంది.

2.హోండా అమేజ్: రూ.8.90 లక్షల నుంచి రూ.11.65 లక్షలు
జపాన్ టెక్నాలజీతో కూడిన హోండా బ్రాండ్ రీసేల్ వాల్యూ విషయంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. హోండా అమేజ్‌లోని 1.2-లీటర్ i-VTEC ఇంజిన్, సీవీటీ గేర్ బాక్స్ కాంబినేషన్ నమ్మకమైన పనితీరుకు ప్రసిద్ధి చెందాయి. కుటుంబానికి సరిపోయే ప్రాక్టికల్ డిజైన్, మంచి ఫీచర్లు, సుదీర్ఘకాలం మన్నికగా ఉండే ఇంజిన్ కారణంగా హోండా అమేజ్ ను సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారులు, కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడతారు.
3.టొయోటా గ్లాంజా:రూ.7.93 లక్షల నుంచి రూ.11.71 లక్షలు
టొయోటా, రీసేల్ వాల్యూ రెండూ విడదీయరాని పదాలు. గ్లాంజా కారు మారుతి బలేనో ఆధారంగా రూపుదిద్దుకున్నప్పటికీ.. దీనిపై ఉన్న టొయోటా బ్యాడ్జ్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ప్రత్యేక విలువను తెచ్చిపెడుతుంది. మారుతి అందించే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ వల్ల మైలేజ్, మెయింటెనెన్స్ సమస్యలు ఉండవు. సర్వీస్ విషయంలో టొయోటా ఇచ్చే మెరుగైన కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఈ కారు రీసేల్ వాల్యూను ఎల్లప్పుడూ టాప్ లో ఉంచుతుంది.
4. మారుతి సుజుకి బలేనో: రూ.7.03 లక్షల నుంచి రూ.10.65 లక్షలు
భారతీయ కుటుంబాలకు బలెనో ఓ పర్ఫెక్ట్ కారు అని చెప్పవచ్చు. ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన క్యాబిన్, అద్భుతమైన రైడ్ క్వాలిటీ, నమ్మకమైన ఇంజిన్ దీని సొంతం. నెట్వర్క్ పరంగా మారుతి నెక్సా ద్వారా లభించే ప్రీమియం ఇమేజ్ దీనికి అదనపు ప్లస్ పాయింట్. హ్యుందాయ్ ఐ20, టాటా అల్ట్రోజ్ వంటి ప్రత్యర్థులతో పోలిస్తే బలేనో రీసేల్ మార్కెట్లో మంచి ధరను పొందుతుంది.
5. మారుతి సుజుకి డిజైర్: రూ.7.38 లక్షల నుంచి రూ.10.98 లక్షలు
ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి డిజైర్ ఒకటి. రోడ్లపై ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ.. ఈ కారు రీసేల్ వాల్యూపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదు. సరికొత్త 1.2-లీటర్ ఫ్యూయల్ ఎఫిషియంట్ ఇంజిన్, ప్రాక్టికల్ స్పేస్, మారుతి బ్రాండ్ ట్రస్ట్ వల్ల కొత్తగా కారు కొనేవారికే కాకుండా.. వాడిన కారు కొనుగోలుదారులకు కూడా ఇది మొదటి ఎంపికగా నిలుస్తోంది.













Click it and Unblock the Notifications