చాలాసార్లు ఆఫర్ వచ్చింది.. బిగ్ బాస్‌కు మళ్లీ ‘నో’ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్!

తెలుగు బుల్లితెరపై భారీగా ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. త్వరలోనే 10వ సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల 'అగ్నిపరీక్ష' పేరుతో ఆడిషన్లు నిర్వహించగా.. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీల పేర్లు హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా బుల్లితెర సీరియల్ నటీనటులతో పాటు కొందరు సినీ తారల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటి సురేఖా వాణి కూతురు, యంగ్ హీరోయిన్ సుప్రీత బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాశంగా మారాయి.

గుండె ధైర్యం ఉంటేనే ఈ థ్రిల్లర్ సినిమా చూడండి.. రూ.7కోట్లకు రూ.4వేల కోట్లు వచ్చాయి
గుండె ధైర్యం ఉంటేనే ఈ థ్రిల్లర్ సినిమా చూడండి.. రూ.7కోట్లకు రూ.4వేల కోట్లు వచ్చాయి

బిగ్ బాస్ నుంచి పిలుపొచ్చింది.. కానీ నో చెప్పాను: సుప్రీత
ఇన్‌స్టా రీల్స్, వీడియోలతో మంచి ప్రజాదరణ పొందిన సుప్రీత.. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీతకు బిగ్ బాస్ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి స్పందించిన సుప్రీత.. తనకు బిగ్ బాస్ షో అంటే ఎంతో ఇష్టమని.. ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూశానని ఆమె వెల్లడించింది. అయితే బిగ్ బాస్ షో నిర్వాకుల నుంచి తనకు పలుమార్లు ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని తెలిపింది. ముఖ్యంగా ఏడో సీజన్లో కంటెస్టెంట్ గా వెళ్లాలని అనుకున్నప్పటికీ.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా మేరకే ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పేర్కొంది.

Surekha Vani Daughter Supritha Reveals Why She Rejected Bigg Boss Offers Full Details Here

మమ్మీకి ఉన్న ఓసీడీ వల్లే ఆఫర్ రిజెక్ట్!
గతంలో బిగ్ బాస్ నిర్వాహకులు ప్రవేశపెట్టిన మమ్మీ-డాటర్ కేటగిరీ కింద 5వ, 6వ సీజన్లలో కూడా సుప్రీత-సురేఖా వాణి జంటకు ఆహ్వానం వచ్చిందట. అయితే ఆ ఆఫర్లను ఎందుకు తిరస్కరించారో సుప్రీత ఈ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. తన తల్లి సురేఖా వాణికి ఓసీడీ సమస్య ఉండటం వల్ల బిగ్ బాస్ హౌస్‌లోని పరిస్థితులకు ఆమె సరిపోరని భావించి ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో కూడా బిగ్ బాస్ హౌస్ కు వెళ్లే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని.. కేవలం ఓ సాధారణ వీక్షకురాలిగానే ఆ షోను ఆస్వాదించడానికి ఇష్టపడతానని సుప్రీత తేల్చి చెప్పేసింది.

డిజాస్టర్ టాక్ తో 300 కోట్ల గ్రాస్.. ఈ రికార్డు నీకే సాధ్యం అన్నా..!
డిజాస్టర్ టాక్ తో 300 కోట్ల గ్రాస్.. ఈ రికార్డు నీకే సాధ్యం అన్నా..!

'అమరావతికి ఆహ్వానం'తో హీరోయిన్‌గా ఎంట్రీ
తన సినిమా కెరీర్ గురించి మాట్లాడిన సుప్రీత తన తొలి సినిమా 'అమరావతికి ఆహ్వానం' ఓ విభిన్నమైన హారర్ థ్రిల్లర్ అని వెల్లడించింది. కథ, కథనాలు నచ్చడంతోనే ఈ ప్రాజెక్టును అంగీకరించానని.. పెద్ద సినిమాల్లో అవకాశాలు సాధించడానికి ఈ సినిమా తన కెరీర్లో తొలి అడుగుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సినీ ఇండస్ట్రీలో ఎదురయ్యే టైప్ కాస్టింగ్ గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్న సుప్రీత.. కథ చిన్నదా, పెద్దదా అని చూడకుండా కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడమే తన ప్రధాన లక్ష్యమని సుప్రీత స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+