సింగిల్ ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ: ప్రత్యేక ఆకర్షణగా పవన్ కొడుకు, కూతురు
Megastar Chiranjeevi: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వైభవంగా కొనసాగుతోంది. ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి ముగ్గులతో పల్లెటూళ్లు సందడిగా మారాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోడిపందేల సంబరం జోరందుకుంది. పలువురు సెలెబ్రిటీలు కోడిపందేల్లో పాల్గొంటోన్నారు.
అటు టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి నెలకొంది. పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు.. ప్రేక్షకులకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్.. పలువురు హీరోలు సంక్రాంతి పండగను జరుపుకొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం సంక్రాంతి పండగకు బెంగళూరుకు షిఫ్ట్ అయింది. బెంగుళూరు ఫామ్ హౌస్‌లో కుటుంబ సభ్యులందరూ కలిశారు. చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. నాగబాబు, రామ్‌చరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్..ఇలా ఫ్యామిలీ మొత్తం ఒకే చోటికి చేరింది.
చిరంజీవి సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దంపతులు హాజరు కాలేదు. ఎన్నికల కార్యక్రమాల్లో తీరిక లేకపోవడం వల్లే పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల పవన్ గైర్హాజరయ్యారు.
పవన్ కల్యాణ్- రేణుదేశాయ్ దంపతుల పిల్లలు అకీరా నందన్, కూతురు ఆద్య.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. చిరంజీవి- అల్లు అరవింద్ కుటుంబాల నుంచి సుమారు 50 మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. బెంగళూరు ఫామ్ హౌస్ మొత్తం సందడిగా మారింది.












Click it and Unblock the Notifications