విజయవాడలో శేఖర్ మాస్టర్ ను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
తెలుగు సినీ పరిశ్రమలో శేఖర్ మాస్టర్ ప్రముఖ కొరియాగ్రాఫర్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరో సినిమాలకు, మీడియం రేంజ్ హీరోల సినిమాలకు శేఖర్ మాస్టర్ కచ్చితంగా కొరియోగ్రఫీ చేస్తారు. అలాగే ఢీ షోకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరపై రాణిస్తున్నారు. అప్పుడప్పుడూ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు కూడా హాజరవుతారు. ఆ సమయంలో మాస్టర్ పై హైపర్ ఆది చేసే కామెంట్స్ వైరల్ గా మారుతుంటాయి. ఎక్కువగా శేఖర్ మాస్టర్ అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుంటాడంటూ ఆది చెబుతుంటాడు.
మంచి పేరున్న కొరియో గ్రాఫర్ కాబట్టి రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది. ఇటీవలే ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. విజయవాడ దగ్గర ఓ ల్యాండ్ విషయంలో తాను మోసపోయానని చెప్పారు. విజయవాడ- హైదరాబాద్ రహదారి పక్కన ఒక స్థలాన్ని శేఖర్ కొనుగోలు చేశారు. మంచి ధర పలికినప్పుడు అమ్మాలనుకున్నారు. తన స్నేహితులద్వారా తెలిసినవారే ఆ స్థలాన్ని కొనిపించారు. అందరూ తెలిసినవారేకదా అన్న ఉద్దేశంతో శేఖర్ మాస్టర్ అప్పుచేసి మరీ దాన్ని కొన్నారు.

కొన్న సమయంలోనే మంచి రేటు వస్తే దాన్ని తామే అమ్మిస్తామని చెప్పారంట. కరోనా తర్వాత భూముల ధరలు పడిపోయాయి కాబట్టి అంత ధర చేయదని వారే చెప్పారంట. సరేలే కానివ్వండి.. ఎంతోకొంతకు అమ్మేయండి.. తాను కూడా అప్పులవారికి డబ్బులు కట్టాలి కాబట్టి కదా అన్నారు. అయితే ఆ తర్వాత స్థలమూ లేదు.. అమ్మినవారి ఫోన్ నెంబర్లు కూడా స్విచాఫ్ వచ్చాయంట. చివరకు ఇలా మోసపోవాల్సి వచ్చిందని మాస్టర ఆ ఇంటర్వ్యూలో వాపోయారు. విజయవాడలోనే జక్రయ్య అనే వ్యక్తి ఉన్నాడని, ఆయనతో తనకు కనీసం పరిచయం కూడా లేదని, అత్తగారి ద్వారా పరిచయం కావడంతో ఆయనే మంచి స్థలం ఇప్పించాడంట. తర్వాత దాన్ని అమ్మింది కూడా ఆయనే. దానివల్ల మంచి డబ్బులు వచ్చాయన్నారు. తెలిసినవారంతా మోసం చేస్తే అసలు పరిచయమే లేని వ్యక్తి మాత్రం చక్కగా లాభాలు వచ్చేలా చూశాడని శేఖర్ మాస్టర్ చెప్పారు.












Click it and Unblock the Notifications