భర్తను వదిలేసి ఆమె నాతో ఉండాలనుకుంది..సమంత హీరో షాకింగ్ కామెంట్స్

వరుణ్ ధావన్, బాలీవుడ్‌లో ప్రస్తుతం దూసుకుపోతున్న యువ నటుల్లో ఒకరు. ప్రముఖ దర్శకుడు దావీద్ ధావన్ కుమారుడుగా పుట్టి, తండ్రి వెలుగు చూపిన మార్గంలోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన వరుణ్, తన ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వరుణ్ ధావన్ తన కెరీర్‌ను సహాయ దర్శకుడిగా ప్రారంభించి, తర్వాత కాలంలో నటుడిగా మారి అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన వరుణ్, ఆ తర్వాత 'హంప్టీ శర్మా కీ దుల్హనియా', 'ఎబిసిడి 2', 'బద్లాపూర్' వంటి సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అతను తన ఫ్యాన్స్‌తో నిరంతరం సంబంధం కొనసాగిస్తూ, తన జీవితంలోని ముఖ్యమైన క్షణాలను వారితో పంచుకుంటాడు. వరుణ్ ధావన్ ఇటీవల వరుసగా తెలుగు హీరోయిన్స్‌తో సినిమాలు చేస్తున్నాడు. సమంతతో సిటాడెల్, కీర్తి సురేష్‌తో బేబీ జాన్ సినిమాలు చేశాడు. ఇదిలా ఉంటే వరుణ్ ధావన్ తాజాగా తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. పెళ్లయిన మహిళ నా పర్మిషన్ లేకుండానే మా ఇంట్లోకి వచ్చింది.

She wanted to leave her husband and be with me- Hero Varun Dhawan

అయితే ఆమె ఓ పవర్ ఫుల్ వ్యక్తి భార్య అని తెలిసింది. తనకు నా గురించి అంతా తెలుసు అని చెప్పింది. నేను తన కోసం నా కుటుంబాన్ని వదిలేస్తానని అనుకుంది. కానీ నేను పోలీసులకు చెప్పాను. అప్పుడే కొందరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి ఆమెను తీసుకెళ్లారని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఆమె నాకు ఇష్టం లేకపోయినా ముద్దు కూడా పెట్టిందని వరుణ్ ధావన్ తెలిపారు. తన వెంటపడ్డ ఆమె భర్త పొజిషన్ ఏంటని చెప్పలేనని వరుణ్ ధావన్ చెప్పారు. అయితే వరుణ్ ధావన్ వెంటపడిన మహిళ టాప్ పొలిటిషియన్ భార్య అని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+