నాగచైతన్యకు కట్నం కింద శోభితావాళ్లు ఎంతిస్తున్నారో తెలుసా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లిచేసుకున్న సమంతకు విడాకులిచ్చేశాడు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొద్దికాలానికి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుండేవికానీ అవన్నీ రూమర్లే అని అక్కినేని అభిమానులు కూడా కొట్టిపారేసేవారు. అయితే హఠాత్తుగా ఆగస్టు 8వ తేదీన నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా నిశ్చితార్థం జరిపారు.

డిసెంబరు నాలుగున జరిగే అవకాశం
పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించలేదు. శోభిత మాత్రం పసుపు దంచుతున్న ఫొటోలను షేర్ చేయడంతో దగ్గరలోనే పెళ్లి తేదీ ఉందని అందరికీ అర్థమైంది. అయితే అన్నపూర్ణ స్టూడియోలోని 22 ఎకరాల్లో సెట్టింగ్ వేసి వీరిద్దరి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నాగార్జున ప్రణాళికలు రచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. డిసెంబరు నాలుగోతేదీన వివాహం జరిగే అవకాశం ఉందని, అన్నపూర్ణ స్టూడియోలో పనులు జరుగుతున్నాయంటున్నారు. శోభిత ధూళిపాళ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి. తర్వాత వారి కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో శోభిత నటిస్తోంది. తెలుగు సినిమాల్లో నటించడం చాలా తక్కువ.

Shobhita Dhulipala s parents giving gold to Naga Chaitanya as dowry

కట్నం కింద బంగారం తెస్తున్న శోభిత
వివాహం కింద నాగచైతన్యకు కట్నం కింద కేవలం బంగారం మాత్రమే ఇస్తున్నారు. డబ్బులు, స్థలాల్లాంటివేవీ ఇవ్వడంలేదు. తమకు డబ్బులు, నగలు, స్థలాలు అవసరంలేదని, తమ కొడుకును జీవితకాలం జాగ్రత్తగా చూసుకుంటే చాలని నాగార్జున శోభిత తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పేశారు. చక్కటి ఇల్లాలుగా నడుచుకుంటే చాలని, తరగనంత సంపద ఉందని, అది అవసరంలేదని చెప్పేశారు. నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన తర్వాతే శోభిత పాపులారిటీ మరింత పెరిగింది. ఏదేమైనప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు సినీ పరిశ్రమలో బలంగా పునాది వేసిన అక్కినేని కుటుంబంలోకి కోడలిగా వెళుతుండటం మాత్రం శోభిత అదృష్టమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+