యావరేజ్ టాక్ తో 100 డేస్ కంప్లీట్.. తొలి సినిమాతోనే ఘట్టమనేని హీరో సంచలనం..
ఒకప్పుడు సినిమా 50 డేస్ ఆడితే హిట్ అని 100 డేస్ ఆడితే సూపర్ హిట్ అని.. 175 రోజులు ఆడితే బ్లాక్ బస్టర్.. ఇక ఆపైన ఆడితే ఇండస్ట్రీ హిట్ అనేవారు. కానీ రాను రాను కాలం మారింది. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. ఈ రోజుల్లో సినిమా హిట్ ను అది సాధించే బాక్సాఫీస్ కలెక్షన్స్ ను బట్టి అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏ సినిమా అయినా మూడు రోజుల కంటే ఎక్కువ థియేటర్లలో ఆడటం లేదు. సినిమా హిట్ అయితే వారం రోజులు.. సూపర్ హిట్ అయితే రెండు వారాలు.. బ్లాక్ బస్టర్ అయితే 20 నుంచి 25 రోజులు ఇలా తక్కువ టైమ్ కే సినిమా థియేటర్లనుంచి వెళ్లిపోతుంది. మరికొన్ని సినిమాలు థియేటర్లలో ఉండగానే ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే ఇలాంటి రోజుల్లో ఓ సినిమా 100 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అది కూడా ఓ హీరో తొలి సినిమానే ఇలాంటి అరుదైన ఘనత సాధించడం విశేషం.
అయితే సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన 'శ్రీనివాస మంగాపురం' అనే సినిమాతో ఆయన తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. హీరోగా జయకృష్ణకు తొలి సినిమానే అయినా ఈ మూవీలో ఆయన యాక్టింగ్, ఫైట్స్ తో ఇరగదీశాడు. అటు డ్యాన్స్ లు కూడా కుమ్మేశాడు. అయితే ఈ మూవీ ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా జూలై 30 న థియేటర్లలో విడుదల కాగా తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రిలీజైన మూడు వారాలకే ఓటీటీకి వచ్చేసింది. కానీ తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్‌లో ఈ సినిమా ఏకంగా వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది.

ఈ రోజుల్లో ఇలాంటి ఘనత సాధించిన తొలి చిత్రంగా 'శ్రీనివాస మంగాపురం' నిలిచింది. యావరేజ్ టాక్ తో ఓ డెబ్యూ హీరో సినిమా వంద రోజుల మైలురాయిని అందుకోవడం ఇప్పుడు అందరినీ షాకింగ్ కు గురి చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల వల్లే ఈ ఘనత సాధ్యమైందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీలో జయకృష్ణ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ రాషా తడానీ అలరించింది. అలాగే ఈ మూవీలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై కిరణ్ నిర్మించారు. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.












Click it and Unblock the Notifications
