దీపావళికి రూ. లక్ష క్యాష్ ను పంచిన టెక్స్‌టైల్స్ వ్యాపారి

దీపావళి పండగ నాడు కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార సంస్థల్లో ఉద్యోగులకు స్వీట్ బాక్సులు, డ్రైఫ్రూట్స్ హాంపర్లు బహుమతిగా ఇవ్వడం చూస్తుంటాం. గుజరాత్‌ సూరత్‌కు చెందిన ఓ టెక్స్‌టైల్స్ వ్యాపారి మాత్రం దీనికి భిన్నం. తన సిబ్బందికి అందించిన దీపావళి కానుక ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. షాప్ లో పని చేస్తోన్న ఉద్యోగులందరికీ కూడా ఏకంగా లక్ష రూపాయలకు పైగా నగదును బోనస్ గా అందించారు. దీపావళి పండగ సమయంలో ఆయన చూపిన ఉదారతను నెటిజన్లు ప్రశంసిస్తోన్నారు.

సూరత్‌లో టెక్స్‌టైల్ వ్యాపారం నిర్వహిస్తున్న రామ్ స్వరూప్ ముండే ఈ దీపావళి వేడుకకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం లేదా కవర్లలో పెట్టి ఇవ్వడం పరిపాటి. ఆయన రూ. 10 నుంచి రూ. 500 నోట్ల కట్టలను వెండి పళ్లెంలో అందంగా పేర్చి తన భార్య చేతుల మీదుగా లక్ష రూపాయల మొత్తాన్ని ఉద్యోగులకు పంచిపెట్టారు. ఈ ఊహించని బహుమతిని అందుకుని పలువురు ఉద్యోగులు భావోద్వేగానికి లోనయ్యారు.

Surat-based textile trader gave 20 employees cash bonuses exceeding Rs 1 lakh on ceremonial

రాజస్థాన్‌కు చెందిన రామ్ స్వరూప్ ముండే వ్యాపార రీత్యా సూరత్‌లో స్థిరపడ్డారు. చాలాకాలంగా టెక్స్‌టైల్ బిజినెస్ చేస్తోన్నారు. మంచి లాభాలను గడించారు. వస్త్ర పరిశ్రమకు కేరాఫ్ గా ఉండే సూరత్ లో ఆయనకు చాలా షాపులు ఉన్నాయి. ఆయా షాపుల్లో 20 మంది వరకు ఉద్యోగులు పని చేస్తోన్నారు. వారందరికీ కూడా ఒక్కొక్కరికి లక్ష చొప్పున మొత్తం 20 లక్షల రూపాయలను రామ్ స్వరూప్ భార్య చేతుల మీదుగా పంచిపెట్టారు.

బస్తర్ అడవుల్లో ప్రధాని మోదీ
బస్తర్ అడవుల్లో ప్రధాని మోదీ

పండగ సంతోషం తన ఇంటికి మాత్రమే పరిమితం కాకూడదని, రాత్రింబవళ్లు తమతో పాటు కష్టపడే ఉద్యోగుల కుటుంబాల్లోనూ వెలుగులు నిండాలనేదే తన ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. తన వద్ద పనిచేసేవారిని కార్మికులుగా కాకుండా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తుంటానని, వారు కూడా అంతే చిత్తశుద్ధితో కష్టపడి చేస్తుంటారని పేర్కొన్నారు. వ్యాపారంలో లభించే లాభాలను ఇలా కిందిస్థాయి సిబ్బందితో పంచుకోవడం వల్ల వారిలో నమ్మకం, సంస్థ పట్ల గౌరవభావం మరింత పెరుగుతాయని అన్నారు.

ఇంకాస్సేపట్లో స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్- లక్ష్మీపూజ
ఇంకాస్సేపట్లో స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్- లక్ష్మీపూజ

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచి రామ్ స్వరూప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో పని ఒత్తిడి ఎక్కువైపోతున్న నేటి రోజుల్లో, సిబ్బంది శ్రమను గుర్తించి ఇలా గౌరవించే యజమానులు చాలా అరుదుగా ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు సరదాగా 'ఈ కంపెనీలో చేరాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి..' అని పోస్ట్ చేస్తోన్నారు. మిగతా సంస్థలు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఉద్యోగులకు కనీస గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు.

సూరత్‌లో దీపావళి బోనస్‌ల విషయంలో ఇటువంటి కానుకలు వెలుగులోకి రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇక్కడి ప్రముఖ వజ్రాల వ్యాపారులు, టెక్స్‌టైల్ యజమానులు తమ సిబ్బందికి కార్లు, ఇళ్లు, ఖరీదైన ఆభరణాలను బోనస్‌గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సాంప్రదాయ పద్ధతిలో, లక్ష్మీదేవి పూజను తలపించేలా ఉద్యోగుల కుటుంబ సమక్షంలో నగదును అందించిన రామస్వరూప్ ముండే శైలి మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+