రిలీజ్‌ కు 4 రోజుల ముందు సినిమా పేరు మార్పు.. టాలీవుడ్ యంగ్ హీరోకు బిగ్ షాక్..!

తెలుగు సినిమాలకు సెన్సార్ కష్టాలు తప్పడం లేదు. ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో సంతోశ్​ శోభన్ నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' అలాగే 'వానర' సినిమాకు సెన్సార్​ బోర్డు పలు అడ్డంకులు పెట్టింది. అయితే తాజాగా ఈ లిస్టులోకి సుహాస్ 'హే భగవాన్' మూవీ చేరింది. తాజాగా ఈ సినిమా పేరు మార్చుకోవాలని సెన్సార్​ బోర్డు చిత్ర నిర్మాతలకు సూచనలు చేసింది. దాంతో విడుదలకు కేవలం 4 రోజుల ముందు ఈ మూవీ టైటిల్ ను 'హే భగవాన్' నుంచి 'హే బల్వంత్' గా మార్చారు. అయితే చిత్ర సీమలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడంతో చర్చనీయాంశం అయింది.

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్‌, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం 'హే భగవాన్'. ఈ మూవీకి గోపీ అచ్చర దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సెన్సార్‌ బోర్డు ఈ సినిమా పేరు మార్చాలని సూచించడంతో చిత్రబృందం దీని టైటిల్‌ ను మార్చింది. 'హే భగవాన్‌'ను 'హే బల్వంత్‌' గా మారుస్తున్నట్లు ప్రకటించింది.

ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకూ విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అంతేకాక సుహాస్, శివాని నగరం గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

Suhas Shivani nagaram Hey Bhagwan Gets Sudden Title Change to Hey Balwant Fans Reactions

ఇదిలాఉంటే మరోవైపు విడుదలకు 4 రోజుల ముందు మూవీ పేరు మార్చాలన్న సెన్సార్‌ తీరుపై నెట్టింట మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన 'కపుల్‌ ఫ్రెండ్లీ' సినిమాకు కూడా టైటిల్‌ మార్చాలని లేదంటే 'ఏ' సర్టిఫికెట్‌ జారీ చేస్తామని సెన్సార్‌ చెప్పింది. అయితే నిర్మాత 'ఏ' సర్టిఫికెట్‌ వచ్చినా ఫర్వాలేదని రిలీజ్‌ కు ముందు పేరు మార్చబోమని చెప్పారు. దీంతో బోర్డు ఆ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ నే జారీ చేసింది. అలాగే గత నెలలో 'వానర' అనే సినిమాకు కూడా టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. దీంతో మేకర్స్​ ఈ సినిమా టైటిల్​ ను 'వనవీర' గా మార్చి రిలీజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+