మరో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసిన సూర్య..ఎక్కడో తెలుసా..?
నటుడు సూర్య గజిని సినిమాతో తెలుగులో మంచిపేరు సంపాదించుకున్నాడు. విభిన్నమైన పాత్రలు, కాన్సెప్టు ఉన్నకథలనే ఎంచుకుంటాడు నటుడు సూర్య. ప్రస్తుతం 'కంగువ' అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా ఇంకా షూటింగ్‌లోనే ఉండగానే మరో ప్రాజెక్టుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ షూటింగ్‌ను అండమాన్ దీవుల్లోప్రారంభించినట్లు సూర్య స్వయంగా సోషల్‌మీడియా వేదికగా ప్రకటించాడు.
ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యినట్లు ఎక్స్ వేదికగా సూర్య అభిమానులతో పంచుకున్నారు. 'లైట్స్, కెమెరా, యాక్షన్..' అంటూ 'లవ్, లాఫ్టర్, వార్' ఈ మూడింటి నేపథ్యంలో కార్తీక్ చిత్రీకరణ మొదలుపెట్టాడని సూర్య పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ తో పాటు ఓ వీడియోను కూడా రీలీజ్ చేశాడు.

ఆ వీడియోలో సూర్య ఓ కొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇది సూర్య నటిస్తున్న 44వ చిత్రం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
సూర్యకు చెందిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం రానుంది. ప్రస్తుతం సూర్య చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications