చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు దోచుకున్నారు...హీరోయిన్లను మాత్రమే పార్టీలకు పిలుస్తాడు

మెగాస్టార్ చీరంజీవి మీద సంచలన ఆరోపణలు చేశారు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి వేల కోట్లు దోచుకున్నారని కామెంట్ చేశారాయన. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గడిచిన కొద్దిరోజుల్లుగా తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. హీరోయిన్ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో'లో సినిమాలో విజయ్ హీరోగా నటించగా, త్రిష హీరోయిన్‌గా నటించింది. మన్సూర్ అలీ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. సినిమా విడుదలైన చాలారోజుల తరువాత మన్సూర్ అలీ ఖాన్ హీరోయిన్ త్రిషపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నానని.. ఉంటే బాగుండేదని మన్సూర్ అలీ ఖాన్ అభిప్రాయపడ్డారు.

tamil actor mansoor ali khan shocking comments on chiranjeevi

త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన వ్యాఖ్యలను సినీ ప్రముఖులు ఖండించారు. ముఖ్యంగా చిరంజీవి, కుష్బు వంటి వారు త్రిషకు మద్దతుగా నిలుస్తూ.. మన్సూర్ అలీ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ త్రిషపై తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.

త్రిష అంటే తనకు గౌరవం అని..రాజకీయాల్లో ఉండటం వల్లే తనపై ఇలా బురద చల్లుతున్నారని మన్సూర్ అభిప్రాయపడ్డారు. తనపై కామెంట్ చేసిన చిరంజీవి , కుష్బులపై పరువు నష్టం దావా వేసినట్లు ఆయన తెలిపారు. మన్సూర్ అలీ ఖాన్ అక్కడితో ఆగకుండా చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేశారు.చిరంజీవి ఓ రాజకీయ పార్టీ వేల కోట్లు దోచుకున్నారని మన్సూర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.

ఆయన ప్రతి ఏడాది హీరోయిన్లకు మాత్రమే పార్టీలు ఇస్తుంటారని.. పేదవారికి ఒక్క రూపాయి కూడా దానం చేయరని చిరంజీవిని ఉద్దేశించి మన్సూర్ అలీ చెప్పుకొచ్చారు. నేను తప్పు చేశానో లేదో నాకు ఒకసారి కాల్ చేసి మాట్లాడితే బాగుండేది. అలా కాకుండా ఆ సమయంలో చిరంజీవి మాట్లాడిన మాటలు తనని బాధించాయి. అందుకే ఆయనతో పాటు, కుష్బు , త్రిషల మీద 20 కోట్ల పరువు నష్టం వేశానని.. దీని ద్వారా వచ్చిన డబ్బును పేదలకు పంచుతానని మన్సూర్ అలీ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+