తారకరత్న భార్య పోస్ట్ వైరల్

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి భర్త మరణాన్ని నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ హీరోగా,తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నందమూరి తారక రత్న తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు.నందమూరి వారసుడిగా అందరి మన్ననలను చూరగొన్న నందమూరి తారకరత్న రాజకీయాల్లో రాణిస్తారు అనుకుంటే ఊహించని విధంగా ఆయన మృతి చెందారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మొదటి రోజునే తారకరత్నకు గుండె పోటు వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా ఆయన కొద్ది రోజులకే మృతి చెందారు.

తారకరత్నంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఒంటరైయ్యారు. ఇక అలేఖ్య, నందమూరి తారకరత్న‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారనే అనుమానం అందరిలోనూ నెలకొంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. అలేఖ్య రెడ్డి భర్త తారకత్నది టీడీపీ కుటుంబం. అలాగే అలేఖ్య రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర బంధువు అవుతారనే విషయం అందరికి తెలిసిందే. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తన మద్దతు బాలయ్య మామయ్యేకే అంటూ ఆమె టీడీపీకే ఓటు వేశారు.

taraka ratna wife alekhya reddy interesting post goes viral

తాజాగా అలేఖ్య రెడ్డి తన భర్తను గుర్తు చేసుకుంటూ ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్‌ను షేర్ చేశారు. బుక్ చదువుతూ ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె లైట్ పింక్ సారీలో పుస్తకం చదువుతూ కనిపిస్తుంది. ఇక ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తారకరత్న‌ను చాలా మిస్ అవుతున్నాను అంటూ.. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+