దొంగగా మారిన హీరోయిన్..చోరీ కేసులో దొరికిపోయిన వైనం
సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది సాధారణ వ్యక్తులు సెలబ్రిటీలుగా మారడం మనం చూశాం. ఇదే సోషల్ మీడియా ద్వారా ఉన్న ఫేమ్‌ను పోగొట్టుకున్న వాళ్లని కూడా చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో సౌమ్య శెట్టి కూడా ఒకరు. యూట్యూబ్ , ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ సౌమ్య శెట్టి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.
తద్వారా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒసేయ్ సూర్యకాంతం, ట్రిప్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా సౌమ్య శెట్టి ఓ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. చెడు అలవాటులకు బానిసైన సౌమ్య శెట్టి దొంగతనాలు చేయడం మొదలుపెట్టింది. ఈక్రమంలో భారీగా అప్పులు చేసిన సౌమ్య తన స్నేహితురాలు ఇంట్లోనే దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది.

తన పాత స్నేహితురాలు మౌనిక టచ్‌లోకి వెళ్లిన సౌమ్య శెట్టి వారి ఇంట్లో 74 తులాల బంగారాన్ని మాయం చేసింది. దీనిపై పోలీసులకు మౌనిక ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడితే విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌమ్య అప్పటికే దొంగగా మారిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. సౌమ్య కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. ఆమె అప్పటికే పరారైనట్టు పోలీసులు తెలిపారు. సౌమ్య ఆ మొత్తం డబ్బును తీసుకొని గోవా పారిపోయింది.

సౌమ్య బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన పోలీసులు ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని అదుపులోకి తీసుకొని విచారించారు.నగలు అమ్మేసిన డబ్బులతో జల్సా చేసినట్టు సౌమ్య పోలీసులకు తెలిపింది. విచారణ అనంతరం సౌమ్యను రిమాండ్‌కు తరలించారు. ఇండస్ట్రీలో మంచి కెరీర్ సంపాదించుకుంటున్న సమయంలో ఇలా చెడు సావాసాలకు లోనై సౌమ్య తన జీవితాన్ని పాడు చేసుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications