ఎన్నికల ఫలితాలపై తెలుగు యాంకర్ షాకింగ్ కామెంట్స్..ఇకపై దానికే నా ఓటు
బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది.

ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. తాజాగా రష్మి చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

బిహార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో నా ఓటు 'నోటా'కే అంటూ ట్వీట్ చేసింది. ఎన్నికల ఫలితాల సమయంలో రష్మి ఈ ట్విట్ ఎందుకు పోస్ట్ చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు.
రష్మి చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. నోటా,ఓట్లు మనకు ఎందుకు .. చక్కగా హాలీడేస్‌ను ఎంజాయ్ చేసేయ్ అంటూ ఓ నెటిజన్ రియాక్ట్ అయ్యారు.నోటాకు ఓటు వేయడం ద్వారా నీకు ఏం వస్తుందంటూ మరో నెటిజన్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం రష్మి షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications