ఆస్తులు కలిసిరావడంతో చిరంజీవి, నాగార్జునను దాటిన శర్వానంద్

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులైన హీరోలెవరంటే అందరూ చెప్పే పేర్లు.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ్‌చరణ్ పేర్లు చెబుతారు. కానీ అతనేమీ స్టార్ హీరో కాడు. కేవలం సాధారణ హీరో. ఆస్తుల్లో మాత్రం చిరంజీవి నుంచి రామ్ చరణ్, మహేష్ బాబు, మురళీమోహన్.. వీరెవరూ సరిపోరు. అతను తలుచుకుంటే సగం హైదరాబాద్ ను కొనేయగలడు. ఎన్ని ఆస్తులున్నా ఊహ తెలిసినప్పటి నుంచి తన ఖర్చులకు అవసరమయ్యే డబ్బును ఆయనే సంపాదించుకున్నాడుకానీ తల్లిదండ్రులపై ఆధారపడలేదు. ఇప్పటికీ అంతే సింపుల్ గా ఉంటాడు. అతనెవరో కాదు.. యంగ్ హీరో శర్వానంద్.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువు..
విజయవాడకు చెందిన శర్వానంద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. రానా దగ్గుబాటి, రామ్‌చరణ్ శర్వా క్లాస్ మేట్స్. వీరంతా పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. తొలిసారిగా యువసేన సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా మంచి హిట్ సాధించిన తర్వాత ప్రస్థానం, గమ్యం చిత్రాలు శర్వాకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత వచ్చిన రన్ రాజా రన్, మహానుభావుడు, శతమానం భవతి సినిమాలు టైర్2 హీరోల జాబితాలోకి చేర్చాయి. శర్వానంద్ తల్లిదండ్రులు బాగా స్థితిమంతులు. హైదరాబాద్ నలుమూలలా వారి ఆస్తులు ఉన్నాయి.

telugu young hero Sharwanand property value he is top rechest person in ap and telangana

షాక్ తిన్న స్నేహితుడు
శర్వానంద్ ఒకసారి తన స్నేహితుడిని కారు ఎక్కించుకొని హైదరాబాద్ మొత్తం తిప్పాడు. స్థలాలు, భవనాలు కనపడినచోటల్లా వాటిని చూపిస్తూ తమ ఆస్తులంటూ స్నేహితుడికి చెప్పాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్ తిన్నాడు. శర్వానంద్ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలో ఉందని తెలుసుకానీ ఇలా వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని తెలియక అతనికి మూర్ఛపోయినంత పనైంది. ఓ సందర్భంలో శర్వానంద్ సినిమాకు సంబంధించిన విలేకరుల సమావేశంలో ఓ విలేకరి ఈ విషయాన్ని నేరుగా అడిగేశారు. హైదరాబాద్ నగరంలో ప్రతి మూలన మీ ఆస్తులున్నాయంట.. సగం హైదరాబాద్ మీదే అని చర్చ జరుగుతోంది.. అని అడగ్గా.. దానికి శర్వా.. ఆస్తులన్న మాట వాస్తవమేకానీ, సగం హైదరాబాద్ కొనేంత ఆస్తులైతే లేవు అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+