మెగా హీరోలంతా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయకపోతే భవిష్యత్తు కష్టమే?

నిర్మాతలతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ప్రేక్షకులు మెగా హీరోలంటేనే భయపడిపోతున్నారు. ఆ కుటుంబంలో ఏ హీరో నుంచి సినిమా వచ్చినా కచ్చితంగా ఫ్లాప్ అవుతోంది. నిర్మాతకు, సినిమాను కొన్నవాళ్లకు తీవ్ర నష్టాలను మిగుల్చుతోంది. దీంతో వీరి సినిమాలను కొనుగోలు చేయాలా? వద్దా? అనే మీమాంసలో పడిపోయారు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు. కొన్నాళ్ల నుంచి మెగా సినిమా ఏది పట్టుకున్నా షాక్ కొడుతోంది. చిరంజీవి భోళాశంకర్ నుంచి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వరకు ఇదే పరిస్థితి. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మెగా ఫ్యామిలీ ఉంది.

పవన్ సినిమాలన్నీ కాస్ల ఫెయిల్యూర్
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో చిత్రం నుంచి మెగా కుటుంబానికి, వీరి సినిమాలను కొనుగోలు చేసే డిస్ట్రిబ్యూటర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఒక సినిమా పోయినా తర్వాత సినిమా అయినా ఆదుకుంటుందేమో అనుకుంటే అది కూడా ఫ్లాప్ అవడంతో బయ్యర్లకు తీవ్ర నష్టాలు తప్పడంలేదు. బ్రో సినిమా రికవరీ కేవలం 70 శాతంగా ఉంది. పవన్ కల్యాణ్ పారితోషికం ఎక్కువ కావడంతో తాను నటించిన సినిమాలన్నీ కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలుస్తున్నాయి. చిరంజీవి కాలం చెల్లిన సినిమాను రీమేక్ రూపంలో భోళాశంకర్ ను తీసుకొచ్చి తన కెరీర్ లో అత్యంత ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఈ సినిమా కొన్నవారు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలు వచ్చాయి.

The future of heroes from Chiranjeevi s family seems uncertain

ఐదోరోజు రూపాయి కూడా రాలేదు
మట్కా సినిమాకు ఐదోరోజు థియేటర్లలో రూపాయి కూడా రాలేదు. అంత ఘోరంగా పరాజయం పాలైంది. ఏ జోనర్ లో సినిమా తీసినా ఫ్లాప్ అవుతుండటంతో వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీని నమ్ముకున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారు. ఇది కూడా పోతే ఏమాత్రం మార్కెట్ లేని హీరోగా నిలుస్తారు. మరో హీరో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ రూపంలో భారీ డిజాస్టర్ ను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇవన్నీ ఇలా ఉంటే పాన్ ఇండియా హీరోగా మారిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రూపంలో మరో చెత్త సినిమాను ప్రేక్షకులకు అందించారు. దీనికి ముందు ఆచార్య, వినయవిధేయ రామ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో ఆర్ఆర్ఆర్ ఒక్కటే రామ్ చరణ్ ను ఆదుకుంది.

సినిమాల కొనుగోలుకు ముందుకురాని డిస్ట్రిబ్యూటర్లు
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతోపాటు తెలుగు సినీ రంగానికి చెందిన నిర్మాతలు, తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మెగా సినిమాల కొనుగోలుపై వెనకడుగు వేస్తున్నారు. చిరంజీవి విశ్వంభర మే నెలలో, పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోగా ఆ సినిమా నిర్మాత ఏఎం రత్నం దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంభర ప్రాజెక్టు వ్యయం భారీగా అవుతుండటంతో యూవీ క్రియేషన్స్ ముందూ వెనక ఆలోచిస్తున్నారు. మొత్తంగా ఇదీ మెగా హీరోల పరిస్థితి. భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+