భయంకరమైన మతమార్పిడి కుట్ర! 'The Kerala Story 2'ఇంత ఘోరమా?
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి, దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపిన 'ది కేరళ స్టోరీ'కి ఇప్పుడు కొనసాగింపు రాబోతోంది. 'ది కేరళ స్టోరీ 2 - గోస్ బియాండ్' (The Kerala Story 2 - Goes Beyond) పేరుతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్(The Kerala Story 2 Trailer) తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మునుపటి భాగం కేవలం కేరళకే పరిమితం కాగా, ఈసారి కథ రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలను కూడా స్పృశిస్తూ మరింత లోతుగా, మరింత తీవ్రంగా ఉండబోతోందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
The Kerala Story 2 - ఈసారి నిశ్శబ్దం లేదు.. పోరాటమే!
"వారు మా కుమార్తెలను లక్ష్యంగా చేసుకున్నారు.. వారి భవితవ్యాన్ని దొంగిలించారు. కానీ ఈసారి మనం నిశ్శబ్దంగా ఉండం.. పోరాడతాం!" అంటూ చిత్ర నిర్మాతలు విడుదల చేసిన నినాదం సినిమా తీవ్రతను చాటి చెబుతోంది. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాణంలో, కమఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

The Kerala Story 2 ట్రైలర్ హైలైట్స్
ట్రైలర్ ప్రారంభమే ఒక భయంకరమైన హెచ్చరికతో మొదలవుతుంది. "రాబోయే 25 ఏళ్లలో భారత్ ఇస్లామిక్ దేశంగా మారవచ్చు" అనే డైలాగ్ కథలోని గంభీరతను పరిచయం చేస్తుంది. అక్కడి నుంచి కథ మూడు భిన్నమైన రాష్ట్రాల నేపథ్యాలకు మారుతుంది:
- రాజస్థాన్ - ఒక తండ్రి ఆవేదన: కేవలం 16 ఏళ్ల మైనర్ బాలికను బలవంతంగా మతం మార్చారంటూ ఒక హిందూ కుటుంబం పోలీసులను ఆశ్రయించే సన్నివేశం భావోద్వేగంగా ఉంది. పోక్సో కేసు చుట్టూ తిరిగే ఈ కథ తల్లిదండ్రుల భయాన్ని ప్రతిబింబిస్తుంది.
- మధ్యప్రదేశ్ - ప్రేమ పేరిట ద్రోహం: ఒక హిందూ యువతిని ప్రేమించి, వివాహం చేసుకున్న తర్వాత ఆమెను మతం మారాలని వేధించే అంశాన్ని ఇక్కడ చూపించారు. నమ్మిన వ్యక్తి నుంచే ద్రోహం ఎదురైతే ఆ మహిళ పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రధానాంశం.
- కేరళ - ముగియని పోరాటం: మతం మారడానికి నిరాకరించిన ఒక యువతి తన స్నేహితుడితోనే ఘర్షణ పడే పదునైన సన్నివేశాలు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. తన అస్తిత్వాన్ని, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటం ఇందులో కనిపిస్తుంది.
ముగ్గురు యువతుల కథ - మూడు జీవితాల సంఘర్షణ
ఉల్క గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ముగ్గురు హిందూ యువతులు ముగ్గురు ముస్లిం యువకులతో ప్రేమలో పడిన తర్వాత వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయనేది వివరిస్తుంది. ప్రేమ వెనుక దాగి ఉన్న మత మార్పిడి ప్రణాళికలు ఎలా వెలుగు చూశాయనేది ఈ కథాంశం.
రాష్ట్రానికి జరిగిన అవమానంగా తొలి భాగం..
తొలి భాగం విడుదలైనప్పుడు కేరళ ముఖ్యమంత్రి దీనిని రాష్ట్రానికి జరిగిన అవమానంగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ కూడా అదే స్థాయిలో చర్చకు దారి తీస్తోంది. నిరాకరణకు, నిశ్శబ్దానికి తావు లేకుండా వాస్తవాలను వెలికితీస్తామని నిర్మాతలు చెబుతుండగా.. మరోవైపు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
"ఇస్ బార్ సహేంగే నహీ... లడేంగే" (ఈసారి భరించం.. పోరాడతాం) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications