సారీ అల్లు అర్జున్ ..ఈసారి జాతీయ అవార్డు ఆ హీరోకే..!
జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భాగంగా ఇవ్వబడుతుంది.ఇది భారత ప్రభుత్వం ద్వారా ప్రధానం చేయబడుతుంది. దీనిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. ఈ పురస్కారం వెండి కమలంతో పాటు రూ.50,000 నగదును ఇవ్వడం జరుగుతోంది.ఇప్పటివరకు అత్యధికంగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్న హీరోల లిస్ట్‌ను గమనిస్తే..కమల్ హాసన్ 3 సార్లు,మమ్ముట్టి 3 సార్లు,అమితాబ్ బచ్చన్ 3 సార్లు, అందుకోవడం జరిగింది.
పుష్ప సినిమాకి గానూ 2023లో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. అయితే 2024లో పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన పుష్ప-2లో అల్లు అర్జున్ నటన చూసిన వారంతా రెండోసారి ఆయన జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం ఖాయమని భావించారు.పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించారు. జాతరలో వచ్చే ఫైట్, క్లైమాక్స్‌లో వచ్చే సీన్లలలో అల్లు అర్జున్ నటన చూసిన వారంతా పిచ్చెక్కిపోయారు.పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ పేరు ఇంటర్నేషనల్ లేవల్లో మార్మోగిపోతుంది. దీంతో అల్లు అర్జున్ రెండోసారి జాతీయ అవార్డు కొట్టడం పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ స్పీడ్‌కు ఓ హీరో బ్రేకులు వేశారు.

ఆ హీరో మరెవ్వరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్. అతను తాజాగా నటించిన చిత్రం 'ఛావా'మహారాష్ట్రలో దేవుడిగా కొలిచే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్‌గా నటించారు.ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ సినిమా ఓ సంచలనమనే చెప్పాలి. ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ముఖ్యంగా విక్కీ కౌశల్ తన పాత్రకు జీవం పోశారంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని..దీన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. హిందీలో మాత్రమే విడుదల కావడం ఛావా సినిమాకు మైనస్‌గా మారింది. ఫ్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల అయి ఉంటే ,దీని కథ మరోలా ఉండేదని సినీ పండితులు చెబుతున్నారు. ఏదీ ఏకమైనప్పటికీ జాతీయ అవార్డు విషయంలో విక్కీ కౌశల్ అల్లు అర్జున్‌కు గట్టి పోటీనిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications