పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయను - హీరో

తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు పూరి జగన్నాథ్ రూటే సపరేటు. సాధారణ హీరోలతో సినిమాలు చేసి వారిని స్టార్లుగా మార్చిన ఘనత కచ్చింతంగా పూరి జగన్నాథ్‌కు దక్కుతుంది. రామ్ చరణ్ , అల్లు అర్జున్, ప్రభాస్ , మహేష్ బాబు, పవన్ కల్యాణ్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలందరూ కెరీర్ స్టార్టింగ్‌లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పని చేసిన వారే.

పూరి జగన్నాథ్ తన సినిమాల్లో చూపించే హీరోయిజానికి అభిమానులు ఫిదా అవుతుంటారు. అయితే గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ తన స్థాయికి తగిన విధంగా హిట్లను అందించడంలో ఫెయిల్ అవుతున్నారు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా ఇస్మార్ట్-2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు తాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయబోనని తేల్చి చెప్పారు. ఆ హీరో మరెవ్వరో కాదు.. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి.

Tollywood young hero not interested in puri direction

పూరి జగన్నాథ్ వారసుడుగా ఆకాష్ పూరి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఆకాష్‌ పూరి కెరీర్‌లో ఇప్పటి వరకూ సరైన హిట్ మాత్రం పడలేదు.తాజాగా ఆకాష్ పూరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొలిటికల్ లీడర్ మనవరాలుతో ఆకాష్‌ పూరి ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

తాజాగా దీనిపై స్పందించిన ఆకాష్ పూరి అలాంటిది ఏమీ లేదని.. అందరికి చెప్పే పెళ్లి చేసుకుంటానని మనోడు క్లారిటీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఎప్పుడుంటుందని ఆకాష్ పూరిని ప్రశ్నించగా.. తన తండ్రి దర్శకత్వంలో సినిమా చేయబోనంటూ బాంబు పేల్చాడు. నటుడుగా తనని తాను నిరుపించుకున్న తరువాతే తండ్రి దర్శకత్వంలో సినిమా చేస్తానని ఆకాష్ పూరి చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+