నువ్వు లేని జీవితం శూన్యం.. త్రిష సంచలన పోస్ట్
హీరోయిన్ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. త్రిష ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది.ఈ విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ..ఈ క్రిస్మస్ ఉదయం నా కొడుకు జొర్రో చనిపోయాడు. నాకు బాగా తెలిసిన వారికి తెలుసు వాడు లేకపోతే నా లైఫ్ శూన్యంతో సమానం అని. ఇప్పటికీ నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ వాడు లేడనే షాక్‌లోనే ఉన్నాము. నేను మళ్లీ దీని నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది' అని జొర్రో సమాధి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు RIP Zorro అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక త్రిష ఇటీవల కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు లేనంతగా ఆమె గురించి చర్చ సాగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారామె. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. 'పొన్నియర్ సెల్వం' రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లియో' సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

లియో సినిమా సక్సెస్‌తో త్రిష డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ. సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి, విజయ్, అజిత్, కమల్, మోహన్ లాల్ సినిమాల్లో నటిస్తూ బిజీ మారారు త్రిష. త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది. తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి.












Click it and Unblock the Notifications