అల్లుఅర్జున్ సినిమాలో త్రిష‌.. ఈ వార్తలో వాస్త‌వమెంతా..?

పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప 2 సినిమా త‌ర్వాత బ‌న్నీ మ‌రో రెండు ప్రాజెక్టులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో ద‌ర్శ‌కుడు అట్లీ సినిమా ఒక‌టి. ఇక‌, ఈసినిమాలో అల్లుఅర్జున్ స‌ర‌స‌న హీరోయిన్‌గా త్రిష చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ న్యూస్ కాస్త సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

త్రిష హీరోయిన్‌గా మౌనం పసియాదే చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా 2002 డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌య్యింది. ఆ త‌ర్వాత పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసి మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. వ‌ర్షం, నువ్వొస్తానంటే..నేనొద్దంటానా.. ఆడ‌వారి మాట‌ల‌కు ఆర్థాలే వేరులే వంటి చిత్రాలు త్రిష కెరీర్‌లో ది బెస్ట్ చిత్రాలుగా చెప్పొచ్చు. ఆ త‌ర్వాత చాలా సినిమాలు న‌టించింది ఈ అమ్మ‌డు. ఒక్క తెలుగులోనే కాకుండా వివిధ భాష‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఇప్ప‌డు త్రిష బ‌న్నీతో జోడిక‌ట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఈవిష‌యంపై అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌టన రాలేదు. ఈ వార్త నిజ‌మైతే, బ‌న్నీ, త్రిష కాంబీనేష‌న్‌లో వ‌చ్చే మొద‌టి చిత్రం ఇదే అవుతుంది.

Trisha in Alluarjun s movie Is this news true

అట్లీ, బ‌న్నీ కాంబినేష‌న్‌లో సినిమా..

అట్లీ, అల్లు అర్జున్‌ కాంబోలో ఓ సినిమా రానుందంటూ వార్తలు వస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇక‌, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ మాత్రం చెన్నయ్‌ సర్కిల్స్‌లో తెగ వైరల్‌గా మారింది. అదే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో త్రిష కథానాయికగా నటించనుందనే వార్త‌. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో అల్లఅర్జున్ స‌ర‌స‌న త్రిష ను తీసుకోబోతున్నార‌ని టాక్‌. దీనికోసం అట్లీ నటి త్రిష‌ను కూడా సంప్ర‌దించార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక‌, ఈ సినిమా గురించి అట్లీ ప్ర‌త్యేకంగా ఓ పోస్ట్‌ను కూడా పెట్టారు. ' మళ్లీ భిన్నమైన కథతో మీ ముందుకు రాబోతున్నాను. కచ్చితంగా సర్‌ప్రైజ్‌ చేస్తాను' అంటూ పెట్టారు. ద‌ర్శ‌కుడు అట్లీ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ బ‌న్నీ సినిమా గురించే అని అభిమానులు అనుకుంటున్నారు. ఈ వార్త‌లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే..!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+