త్రిష-విజయ్ డేటింగ్ రూమర్స్‌పై కంగనా షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ చుట్టూ జరుగుతున్న వివాదాలు, ఆమెపై వస్తున్న పుకార్లపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో స్పందించారు. సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో త్రిష లక్ష్యంగా జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని ప్రశ్నిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో నిర్వహించిన 'దిశ' అభివృద్ధి సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ.. తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. త్రిష పేరును నేరుగా ప్రస్తావించకుండానే.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలు లేదా బంధాల విషయంలో సమాజం వ్యసనపూరితంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.

ఐరాస బిగ్ షాక్..! కొత్త మ్యాప్ లో స్వతంత్ర ప్రాంతాలుగా అరుణాచల్, పీఓకే..! కేంద్రం ఫైర్..!
ఐరాస బిగ్ షాక్..! కొత్త మ్యాప్ లో స్వతంత్ర ప్రాంతాలుగా అరుణాచల్, పీఓకే..! కేంద్రం ఫైర్..!

"ఓ బంధంలో ఇద్దరు వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నప్పుడు వేధింపులు, వ్యక్తిత్వ హననం విషయానికి వస్తే మాత్రం ఎప్పుడూ మహిళలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారు?" అని కంగనా రనౌత్ సూటిగా ప్రశ్నించారు. ఈ వివక్ష కేవలం ఇండియాకే పరిమితం కాలేదని.. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని కంగనా పేర్కొన్నారు. స్వశక్తితో ఎదిగిన మహిళలను, విజయం సాధించిన నటీమణులను, రాజకీయ నాయకులను, అధికార పదవుల్లో ఉన్న శక్తివంతమైన మహిళలను కిందకు దిగజార్చడానికి వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారని కంగనా ఆవేదన వ్యక్తం చేశారు.

Trisha-Vijay Dating Rumours Kangana Ranaut Questions Targeting of Women why face character assassination

వివాదానికి నేపథ్యం
నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌తో త్రిష డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళలపై అభ్యంతరకర కామెంట్స్ లేదా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హెచ్చరించిన కొద్ది రోజులకే కంగనా రనౌ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Kaaka Movie: 'కాకా’లో చిరంజీవికి ఈమెనే స్పెషల్..!
Kaaka Movie: 'కాకా’లో చిరంజీవికి ఈమెనే స్పెషల్..!

మరోవైపు కావేరీ జలవివాదం నిరసన సభలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన కొన్ని కామెంట్స్ త్రిషను ఉద్దేశించినవేనంటూ భారీ వివాదం చెలరేగింది. అధికార టీవీకే పార్టీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో ఉదయనిధి స్టాలిన్ పై కేసు నమోదు కావడం, ఆపై ఆయన అరెస్ట్ కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రజా జీవితంలో ఉన్న మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సమాజం మహిళల పట్ల తన దృక్పథాన్ని మార్చుకోవాలని కంగనా రనౌత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+