5 రోజుల్లో గుడ్ న్యూస్: విజయ్ సీఎం అయిన వేళ త్రిష పోస్టు వైరల్..!
తమిళనాడు నూతన సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌తో సీఎంగా గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అన్నాడీఎంకే, బీజేపీ , కాంగ్రెస్ నేతలు హజరయ్యారు. వీరితో పాటు నటి త్రిష, టీవీకే విజయ్ కుటుంబ సభ్యులు హజరయ్యారు. అయితే విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష సందడి చేశారు. త్రిష నీలిరంగు కంచి పట్టుచీర, జడలో మల్లెపూలతో తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా ఆమె కనువిందు చేశారు. స్టేజీ వద్ద అందరికి అభివాదం చేస్తు వేడుకకు హజరైన అతిథులను ప్రత్యేకంగా పలకరించారు త్రిష. అలాగే వేదిక మీద నుంచి విజయ్ దళపతి సైతం త్రిషను నవ్వుతూ పలు మార్లు చూశారు.
ఇక త్రిష ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో కురుప్పు అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ మే 14 న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ రాత్రి 7 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. సూర్య మార్క్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన కురుప్పు సినిమా సమ్మర్ బిగ్గెస్ట్ రిలీజ్‌లలో ఒకటిగా నిలిచేందుకు రెడీ అయింది. అయితే కురుప్పు సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీపై త్రిష తన ఇన్ స్టా ఖాతాలో తాజాగా పోస్టు పెట్టారు. మరో ఐదు రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతుందని ఆ పోస్టు సారాశం. అయితే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, మరో ఐదు రోజుల్లో త్రిష మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో త్రిష ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

కురుప్పు సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో ఆర్జే బాలాజీ, ఇంద్రన్స్, స్వాసిక వంటి నటులు కీలక పాత్రల్లో మెరిశారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. కురుప్పు మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఎస్. ఆర్ నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications