బేబీ బ్యూటీకి బంపర్ ఆఫర్
సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలగాలంటే అందంతోపాటు అదృష్టం కూడా ఉండాలని చెబుతుంటారు. కొంతమంది వీటిని నిజం చేస్తుంటారు. యూట్యూబ్, వెబ్ సిరీస్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ల చేస్తున్న ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తాజాగా ఏ స్టార్ హీరోయిన్ అందుకోలేని అవకాశాన్ని దక్కించుకుంది.
ఆ హీరోయిన్ పాత్రలో : బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ బ్యూటీకి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఓ అరుదైన అవకాశం కూడా ఆమె తలుపు తట్టింది. దివంగత నటి, స్టార్ హీరోయిన్ సౌంరన్య బయోపిక్ తీసున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించే అవకాశాన్ని వైష్ణవి చైతన్య పట్టేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడంతోపాటు అచ్చ తెలుగు అమ్మాయి కావడం వల్ల కూడా వైష్ణవికి ఈ అవకాశం దక్కినట్లు భావిస్తున్నారు. దీనిపై మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తేనే ఒక స్పష్టత రానుంది.

రూ.90కోట్లు రాబట్టింది : రామ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో కూడా ఒక కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందుతున్న మరో చిత్రంలోను వైష్ణవి ఎంపికైంది. జులై 14వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు రూ.90 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీన్ని కొనుగోలు చేసిన బియ్యర్లు ఎంతో లాభపడ్డారు. గతవారమే ఈటీవీలో ప్రసారమైన ఈ సినిమా మంచి వ్యూస్ దక్కించుకుంది.












Click it and Unblock the Notifications