మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న వరుణ్‌తేజ్..
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాడు. ఇటీవలే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకున్న వరుణ్ ఇప్పడు తన ఫోకస్ అంతా సినిమాలపై పెట్టాడు. తాజాగా 'ఆపరేషన్ వాలంటైన్' సినిమాతో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా ఆడియెన్స్ ముందుకొచ్చాడు వరుణ్‌తేజ్. ప్రస్తుతం 'మట్కా' సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజిగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక, ఈ మూవీలో వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ తరహా క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా, తను మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ సినిమాపై సోషల్‌మీడియాలో కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది.
తన నెక్ట్స్ ప్రాజెక్టుకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నట్లు తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. ఈ వార్తలు కూడా దాదాపు నిజమయ్యాయని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే దర్శకుడు గాంధీ వరుణ్ కలిసి స్టోరి చెప్పారని, ఆ స్టోరీ వరుణ్‌కు తెగ నచ్చేసిందని టాక్ నడుస్తోంది. మట్కా సినిమా షూటింగ్ అనంతరం..కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా పెళ్లితర్వాత వరుణ్ తేజ్ ప్రాజెక్టులతో బిజి బిజిగా గడిపేస్తున్నాడనే టీ టౌన్ వర్గాల్లో టాక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాసిన ఈ స్టోరీ, క్రైమ్, అడ్వైంచరస్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని సమాచారం. ఇక, త్వరలోనే ఈ మూవీపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మాణం చేస్తున్నాయి.













Click it and Unblock the Notifications