ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతుడిగా!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చక్కటి కుటుంబ కథా చిత్రాలు, మంచి ప్రేమకథా చిత్రాల కథానాయకుడిగా పేరు సంపాదించుకున్నారు విక్టరీ వెంకటేష్.సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ, ఒక అగ్ర నిర్మాత తనయుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ తన కష్టాన్ని, టాలెంట్ ను మాత్రమే నమ్ముకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారారు.

మహిళా అభిమానులను ఎక్కువగా సంపాదించుకున్నారు. వెంకీ నుంచి చిత్రం వస్తోంది అంటే.. కచ్చితంగా అది మినిమం గ్యారంటీగా భావిస్తారు. అందాల నటుడు శోభన్ బాబు తర్వాత అంతటిపేరును కొల్లగొట్టారు వెంకటేష్.

Venky is also one of the richest people in two Telugu states

యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న వెంకీ ఆస్తుల విలువ ఎంత ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. హైదరాబాద్ లో ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. తాను చేసిన సినిమాల నుంచి సంపాదించిన డబ్బు కలుపుకుంటే రూ.2500 కోట్లకు పైగా ఆస్తి ఉంది. కేవలం ఇవి తాను సంపాదించిన సంపాదన మాత్రమే. అగ్ర నిర్మాతగా పరిశ్రమను శాసించిన రామానాయుడి నుంచి వారసత్వంగా మరికొన్ని ఆస్తులు వెంకటేష్ కు సంక్రమించాయి. దీంతో వాటిని కూడా కలుపుకుంటే వెంకీ ఆస్తి చాలా ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఏపీ, తెలంగాణలో అత్యధిక ధనవంతుల జాబితాలో వెంకటేష్ ఒకరుగా ఉన్నారు. వ్యాపారాలు కూడా భారీగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే అవి వెంకీవని చాలామందికి తెలియదంటారు. వాటిని తన సోదరుడితోపాటు ఇతర సన్నిహితులు చూస్తుంటారు.

ఇటీవలే దృశ్యం, నారప్ప చిత్రాలను అమ్మడంద్వారా వెంకీ సోదరుడు సురేష్ బాబు రూ.70 కోట్లు ఆర్జించారు. కేవలం సినిమాల అమ్మకంద్వారానే ఇలావుంటే రియల్ ఎస్టేట్.. తదితర వ్యాపారాలద్వారా వెంకటేష్ తోపాటు సురేష్ బాబు ఆస్తులు కూడా భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+