చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత..
ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వర రావు కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమంలో విషాదం నెలకొంది. తమిళ, తెలుగు భాషాల్లో విశ్వేశ్వర రావు అనేక సినిమాల్లో నటించారు. తన నటనతో అందరిని నవ్వించారు.విశ్వేశ్వర రావు మంగళవారం ఉదయం అనారోగ్యంతో మరణించినట్లు తెలిసింది. కాగా ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. విశ్వేశ్వర రావు మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంది.
విశ్వేశ్వరరావు హాస్యనటుడిగా తిమిళ, తెలుగు భాషాల్లో 150 పైగా చిత్రాల్లో నటించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వెండి తెరపై కాకుండా బుల్లితెరపై కూడా నటించి అభిమానులను సంపాదించుకున్నారు. విశ్వేశ్వర రావు మృతదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించున్నట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర రావు సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున, పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు.

ఆమె కథ, ముఠా మేస్త్రీ, బిగ్‌బాస్, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివపుత్రుడు, శివాజీ వంటి విజయవంతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విశ్వేశ్వర రావు నిర్మాత, దర్యకుడిగా కూడా మారారు. ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు. విస్సు టాకీస్ పేరుతో తమిళ్ లో ఈ యూట్యూబ్ ఛానల్ కొనసాగిస్తున్నాడు.
ఈ ఛానలలో సినిమాలకు సంబంధించిన పలు విషయాలను సబ్సక్రైబ్రర్స్ తో పంచుకుంటారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితతో తాను పనిచేసినట్లు యూట్యూబ్ ఛానల్ విశ్వేశ్వర రావు చెప్పారు.












Click it and Unblock the Notifications