విజయ్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్.. ఎన్నికల తర్వాతే..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జననాయగన్' సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డుతో సాగుతున్న వివాదం కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే మూవీ రిలీజ్ పై ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మద్రాస్ హైకోర్టులో సెన్సార్ బోర్డుపై వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంది.
అయితే చిత్ర నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయంతో జననాయగన్ మూవీ థియేటర్లలో రిలీజ్ కు అడ్డంకులు తొలగినట్లుగా అంతా భావించారు. అయితే తాజాగా కెనడాలోని ప్రముఖ పంపిణీ సంస్థ యార్క్ సినిమాస్ సోషల్ మీడియాలో జన నాయగన్ మూవీ రిలీజ్ ఏకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు వాయిదా పడినట్లు పోస్టు పెట్టింది. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
కెనడాలోని ప్రముఖ పంపిణీ సంస్థ యార్క్ సినిమాస్ తాజా ప్రకటనలో "ప్రియమైన ప్రేక్షకులారా.. 'జన నాయగన్' సినిమా ఏప్రిల్ 30వ తేదీ లోపు విడుదల కాదని గమనించగలరు. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తమ రిఫండ్ కోసం థియేటర్లను సంప్రదించవచ్చు" అని పోస్టులో పేర్కొంది. ఈ క్రమంలో ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ చివరలో లేదా మే నెలలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ మూవీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
జన నాయగన్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిలీజ్ అయితే విజయ్ టీవీకే పార్టీ ఎన్నికల ప్రచారానికి ప్లస్ అవుతుందని విజయ్ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ ఎన్నికల తర్వాతే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను ఇప్పటికే రివైజింగ్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి క్లియరెన్స్ వచ్చాకే చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్ ను ప్రకటించే వీలుంది. ఇక కెనడా డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన సమాచారం చూస్తుంటే.. ఇతర దేశాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక జన నాయగన్ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. మలయాళ బ్యూటీ మమితా బైజు కీలక పాత్ర పోషించింది. ఇందులో ప్రకాశ్ రాజ్, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది.












Click it and Unblock the Notifications