అయ్యో.. సంక్రాంతి రేసు నుంచి స్టార్ హీరో మూవీ అవుట్..?
సంక్రాంతి పండగ సమయంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ టైమ్ లో యావరేజ్ సినిమాలు హిట్ అవుతాయి. హిట్ సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఇక సూపర్ హిట్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటాయి. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు.
అయితే ఈ సంక్రాంతికి కూడా చాలా పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'.. అలాగే మాస్ మహారాజ రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీనారీ నడుమ మురారీ' చిత్రాలు కూడా పండక్కే రిలీజ్ అవుతున్నాయి.

సంక్రాంతి పండక్కి తెలుగు సినిమాలతో పాటుగా తమిళం నుంచి రెండు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో దళపతి విజయ్ చివరి సినిమాగా తెరకెక్కిన 'జన నాయగన్', అలాగే శివ కార్తికేయన్ 'పరాశక్తి' ఉన్నాయి. అయితే విజయ్ జన నాయగన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కానుంది. విడుదలకు రెండే రోజుల ఉంది.
అయినా ఈ మూవీకి సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాలేదు. మూవీలో రాజకీయాలకు సంబంధించిన డైలాగ్స్ ఉన్న కారణంగా ఈ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి ఇరువురి వాదనలు విని తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. దాంతో ఈ మూవీ వాయిదా పడుతోంది అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విజయ్ చివరి సినిమాకు ఇలా అడ్డంకులు రావడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications