పవన్ కల్యాణ్‌కు స్టార్ నిర్మాత కౌంటర్..ఏపీకి వెళ్లి నేను ఏం చేస్తా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' ప్రీమియర్స్ సమయంలో ఓ మహిళ మరణించడంతో పాటు ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫైర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ వివాదం ఇప్పుడు పెద్దగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా తెలుగు అల్లు అర్జున్‌తో పాటు, ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు.
తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్‌కు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోనని తేల్చిచెప్పారు. ఇది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాకే అని చెప్పాలి. ఇదే సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. దీంతో ఇండస్ట్రీకి ఏపీకి షిఫ్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలిరావాలని కోరారు.తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు. బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేవంలో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదు. నేనిక్కడ డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఏపీకి వెళ్లి ఏం చేస్తా అని ప్రశ్నించారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తో త్వరలో టాలీవుడ్ మీటింగ్ ఉంటుదనే విషయం నాకు తెలియదు అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications