మహేష్ బాబుకు షాకిచ్చిన జాన్వీకపూర్?

అందాల నటి శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్ ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రం చేస్తోంది. రెండు భాగాలుగా రూపొందబోతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని అక్టోబరులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ రెండు చిత్రాలతోపాటు అల్లు అర్జున్ పుష్ప2లో ఓ కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ చిత్రయూనిట్ అధికారికంగా దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీని యాంకర్ ఓ ప్రశ్న అడిగారు. తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు.. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అని పేర్లు కూడా హోస్టే చెప్పారు. అయితే ఆ పేర్లేవీ కాకుండా తనకు విజయ్ దేవరకొండ అంటే ఎంతో ఇష్టమని జాన్వీ చెప్పింది. ప్రస్తుతం తనతో సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. మంచి కథ వస్తే నటించడానికి సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం జాన్వీ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలెవరు కాకుండా విజయ్ పేరు చెప్పడంపై అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో అందగాడైన హీరోగా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు పేరు కూడా చెప్పకపోవడంపై ప్రిన్స్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

who is janhvi kapoor favourite telugu hero

జాన్వీ కపూర్ మార్చి 6 1997లో జన్మించింది. 2018లో రొమాంటిక్ డ్రామా ధడక్‌తో తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించింది. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ (2020), మిలీ (2022) లో ఫ్రీజర్‌లో చిక్కుకున్న మహిళ కథాంశంతో ఏవియేటర్‌గా నటించింది. ఇందులో నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్లు అందుకుంది. అనిల్ కపూర్, సంజయ్ కపూర్ కు మేనకోడలు అవుతుంది. ముంబయిలోని ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్‌లో విద్యనభ్యసించింది. సినిమాల్లోకి రావడానికి ముందు కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి కోర్సు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+