Fact Check: దేవుళ్ల విగ్రహాలను వీధుల్లోకి విసిరేస్తున్నారు.. ఆ ప్రచారంలో నిజం లేదు...
కరోనా కష్ట కాలంలో ఏ హిందూ దేవతా లేదా దేవుడు తమను రక్షించట్లేదన్న ఆగ్రహంతో ప్రజలు దేవతామూర్తుల విగ్రహాలను వీధుల్లోకి విసిరేస్తున్నారనే ఓ వార్తా కథనం ఇటీవల వైరల్‌గా మారింది. దేవుళ్లపై నమ్మకం కోల్పోవడంతో ప్రజలు తమ ఆగ్రహాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారని షియా వేవ్స్ అనే వెబ్‌సైట్ ఆ కథనాన్ని ప్రచురించింది. ప్రజలు వేలాది హిందూ దేవతా విగ్రహాలను వీధుల్లోకి విసిరేసినట్లుగా పేర్కొంది. అయితే ఈ కథనంలో ఎంతమాత్రం నిజం లేదు.
తాము నిత్యం కొలిచే దేవతామూర్తులు కోవిడ్ నుంచి తమను రక్షించట్లేదనే ఆగ్రహంతో ఉన్నారని షియా వేవ్స్ ఆ కథనంలో పేర్కొంది. ఇక ఏ దేవుడు తమను కాపాడలేరన్న అభిప్రాయానికి వచ్చాక దేవతామూర్తుల విగ్రహాలను వీధుల్లోకి విసిరేసినట్లు తెలిపింది. కానీ ఈ వార్తా కథనంలో ఎంతమాత్రం నిజం లేదు. ఇందులో ఉన్న వీడియోలు 2015,2019కి చెందినవి.

2019లో సబర్మతీ నదిని స్వచ్చంగా ఉంచాలన్న ఉద్దేశంతో.. దేవుళ్ల విగ్రహాలేవీ నదిలో వేయవద్దని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీంతో దేవీ నవరాత్రులు,ఇతరత్రా హిందూ పండగల సమయంలో ఆరాధించిన విగ్రహాలను అక్కడి ప్రజలు నదిలో కాకుండా ఒడ్డున వదిలేశారు. సబర్మతీ నది కలుషితం కావొద్దన్న అధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఇలా చేశారు.
అప్పట్లో ఐఏఎస్ అధికారి విజయ్ నెహ్రా కూడా దీనిపై ట్వీట్ చేశారు. 'ఈరోజు అహ్మదాబాద్‌లో ఏదో అద్భుతం జరుగుతోంది. సాధారణ ప్రజానీకం సబర్మతీ నదిని క్లీన్‌గా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అందుకే దశమ విగ్రహాలను నదిలో కాకుండా నది ఒడ్డునే వదిలేస్తున్నారు. ఇది నమ్మలేని మార్పు...' అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Something amazing is happening in #Ahmedabad today.
— Vijay Nehra (@vnehra) August 11, 2019
Ordinary citizens have decided to keep #Sabarmati river clean.
Instead of immersing Dashama idols in the river, they have respectfully left them on the banks!!
Thousands and Thousands of them. Unbelievable change 🙏 pic.twitter.com/t5f0yh9ywr
ఇక ఇదే కథనంలో ఉన్న మరో సగం వీడియో 2015కి చెందినది. అప్పట్లో తెలంగాణలోని కృష్ణా నదిలో దేవుళ్ల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్లిన వీడియో అది. ఇప్పుడా వీడియోను సదరు వెబ్ సైట్ తొలగించింది. కాబట్టి హిందువులు తమ దేవతామూర్తుల విగ్రహాలను విసిరేస్తున్నారన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని గ్రహించాలి.
Indians throw thousands of idols on the street for not protecting them against the virus - Shia World's News. GOD IS WORKING HIS PURPOSE! https://t.co/OvkDb6fSsI
— Kemi G (@Honorarygrandma) May 12, 2021

Fact Check
వాదన
తమ దేవుళ్లు తమను కోవిడ్ నుంచి కాపాడట్లేదని భారతీయులు దేవతామూర్తుల విగ్రహాలను విసిరేస్తున్నారు.
వాస్తవం
ఈ ప్రచారంలో నిజం లేదు. ఆ కథనంలో ఉన్న ఫోటోలు 2019లో సబర్మతీ నది ఒడ్డున భక్తులు వదిలిన విగ్రహాలు. నది కలుషితం కావొద్దని అలా నది ఒడ్డున విగ్రహాలను వదిలేశారు.
రేటింగ్
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications