కేజ్రీవాల్ గెలుపు-వామపక్షాలు ఏంనేర్చుకోగలవు?

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం వెనుక- కులం, మతాలు, ధన బలానికి అతీతంగా ఓటు వేసిన లక్షలాది సామాన్య ప్రజలు వున్నారు. అంటే; ఒక రాజకీయ పక్షం గనుక- నిజాయితీగా, ప్రజల పట్ల విశ్వాసంతో, పారదర్శకంగా, ప్రజల నుంచీ నాయకులనూ- తన అజెండాను ఎంచుకుంటూ, ముందుకు సాగితే జనాలు ఆ పక్షానికే నీరాజనాలు పడతారని నేడు రుజువయ్యింది. కాగా, ఈ నేపథ్యంలోనే స్వాతంత్ర్ర్యానంతరం- సుమారు ఆరున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో- పలు రాజకీయ పక్షాల విశ్వాసాలూ, వాటి పని తీరూ- నేడు ప్రశ్నార్థకంగా మారాయి. ముఖ్యంగా వామపక్షాలు ఈ దేశంలోని, జన సామాన్యానికి ప్రతినిధులుగా ఉన్నాయి. కానీ, అవి కాల క్రమేణా, తామూ తరచుగా విమర్శించే బూర్జువా భావజాలానికే తలొగ్గడం వలన- వాటికి జనాదరణ సన్నగిల్లింది. ఈ క్రమంలోనే అది- తమ పరాజయాలకూ, నిస్పృహలకూ కారణంగా- ఎన్నికల రంగంలో; డబ్బు, కులం, మతం, ‘ప్రభావాలను' చూడసాగాయి. ఈ వాదనలతోనే అవి, తరచుగా ఏదో ఒక ప్రధాన ‘బూర్జువా' పక్షంతో పొత్తులకూ, తద్వారా చట్ట సభలలో కొద్దిపాటి ప్రాతినిథ్యానికి గురయ్యాయి.
కానీ నేడు, అరవింద్ కేజ్రివాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలలో సాధించిన మానసిక విప్లవం- పై తరహా వాదనలను పటాపంచలు చేసింది. ఎన్నికలో గెలిచేందుకు కావాల్సింది- ధన బలం, కులం, మతాలు కాదనీ, అది నిబద్ధత, ప్రజల పట్ల విశ్వాసం, ప్రజా జీవితం నుంచే ఎంచుకున్న రాజకీయ అజెండాలు అని- ‘ఆమ్ ఆద్మీ' విజయం నిరూపించింది. కాబట్టి, వామపక్షాలు- ఇది తమ ఆత్మ విమర్శను- తాము ఇన్నాళ్లూ విశ్వసిస్తూ (విశ్వసింజేస్తూ- కూడా) వచ్చిన- ఈ నమూనాలపై గురిపెట్టవలసివుంది.
అయితే దీనర్థం, ఆమ్ ఆద్మీ పార్టీకి అన్ని కితాబులు, త్వరపడి ఇచ్చేయాలని కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ, తన ఆర్థిక అజెండానూ, మతతత్వం పట్ల తన దృక్పథాన్ని వెల్లడిస్తే గానీ- ఆ పార్టీ గురించి వ్యాఖ్యానించ గలిగింది, పెద్దగా ఏమిలేదనేది, వామపక్షాల వాదన! ఇదీ సమంజసమైనదే. ఎందుచేతనంటే; నేడు ఆమ్ ఆద్మీ పార్టీ మూల అజెండా అయిన అవినీతి పోరాటం అంశం- నిజానికి, నేడు దేశంలో అమలు జరుగుతోన్న నయా ఉదారావాద విధానాలతో ముడిపడి వుంది. 1990ల నుంచీ దేశంలో అమలు జరుగుతోన్న, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ- ఆర్థిక విధానాల నుంచీ, నేడు దేశంలోని అపరిమితమైన అవినీతి పుట్టుకొస్తోంది. కాబట్టి; ఈ నయా ఉదారవాదం అంశంగా- ఆమ్ ఆద్మీ పార్టీ, తన వైఖరిని స్పష్టం చేయాలి. అలాగే, మతతత్వం అంశం కూడా.
అయితే అదే సమయంలో వామపక్షాలు కూడా కొన్ని అంశాలపై ఆత్మ విమర్శను అనివార్యంగా చేసుకోవాలి. వాటిలో ఒక ముఖ్య అంశం- అది, గతంలో ఎన్నడూ-నయా ఉదారవాద విధానాలను అనుసరిస్తోన్న, ఏ రాజకీయ పక్షంతోనూ జట్టు కట్టనే లేదా? తాము లౌకికవాదులుగా విశ్వసించిన నాయకులు, బిజెపి పంచన చేరడం లేదా? మరి, దీని సారం ఏమిటి? దీనికి, మనం వామపక్షాల నుంచి జవాబును ఆశించవచ్చు. అందుచేత, అంతిమంగా; గొప్ప శాస్త్రీయ సిద్ధాంతం పునాదుల నుంచి జన్మించిన వామపక్షాలు, తిరిగి ‘బ్యాక్ టు బ్యాసిక్స్' ప్రయాణాన్ని ఆరంభించాలి. అది జరిగిన నాడే- దేశంలోని పలు ఆర్థిక- రాజకీయ -సామాజిక సమస్యలకు పరిష్కారం చూపగల- ఒక బలమైన రాజకీయ మార్గం మన ముందు ఏర్పడగలదు!!
-డి. పాపారావు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications