ఎన్టీఆర్ తో డివిఎస్ కు సాన్నిత్యం

DVS Raju
ఏ పని ప్రారంభించినా క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేసి విజయవంతంగా పూర్తి చేయగల కార్యాదీక్షాదక్ష్యుడు డి.వి.ఎస్.రాజు. అంతే క్రమశిక్షణ, అంకితభావం గల వ్యక్తి నవరస నటనా సార్వభౌమ నందమూరి తారకరామారావు. వీరిద్దరూ మంచి సన్నిహితులు. డివిఎస్ రాజు అనగానే చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ కు మంచి మిత్రుడు అని గుర్తు తెచ్చుకుంటారు. అంత సాన్నిత్యం ఉండేది వారిందరి మధ్య. ఎన్టీఆర్ చేసే ప్రతి పనిని డివిఎస్ రాజు, డివిఎస్ రాజు చేసే పనిని ఎన్టీఆర్ ప్రోత్సహించేవారు.రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు దివంగత ఎన్టీఆర్ తక్షణమే స్పందించేవారు. ఏధైనా సమస్య వచ్చినప్పుడు ఆయన ఎన్టీఆర్ పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ సహాయ కార్యక్రమాల్లో డివిఎస్ రాజు తన చేయి వేసేవాడు.ఇంత మంచి అనుబంధం వారిది.

ఓ సందర్భంలో ఎన్ఎటి సంస్థ నిర్వహించిన పిచ్చిపుల్లయ్య చిత్రానికి ప్రచార, ప్రకటన పత్రాలు డివిఎస్ రాజు ముద్రించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్, డివిఎస్ ల పరిచయం జరిగింది. క్రమంగా వారి పరిచయం బలపడింది. డివిఎస్ రాజు వ్యక్తిత్వం నచ్చిన ఎన్టీఆర్ ఆయనకు తన ఎన్ఏటి సంస్థలో భాగస్వామిగా చేర్చుకున్నారు. ఆ క్రమంలో తోడుదొంగలు, గులోబకావళి కథలు, జయసింహా, పాండురంగ మహాత్య్మం తదితర చిత్రాల్లో డివిఎస్ ఎన్టీఆర్ సంస్ధలో భాగస్వామిగా ఉన్నారు. తన చిత్రాలకు మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమకు డివిఎస్ చేస్తున్న సేవలు ఎన్టీఆర్ ను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పవచ్చు.

ఆ తర్వాత చిత్ర పరిశ్రమ భీష్మాచార్యుడుగా పేరుగాంచిన డివిఎస్ రాజు ప్రగతి ఆర్ట్సు సంస్థ ద్వారా అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా మా బాబు అనే చిత్రాన్ని నిర్మించారు. డివిఎస్ రాజు కొత్తవారిని బాగా ప్రోత్సహించేవారు. ఆ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్ట్రార్ చిరంజీవి, నటకిరీటీ రాజేంద్రప్రసాద్ చిత్ర పరిశ్రమకు వచ్చి వెలుగుతున్నారు.

ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించినప్పుడు ఆయన ప్రోత్సహించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. ఎన్టీఆర్, డివిఎస్ హయాంలోనే తెలుగు లలిత కళాతోరణాన్ని నిర్మించారు. ఇది ఇటీవల వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. డివిఎస్ సేవలకుగాను అప్పటి ఎన్టీఆర్ ఆధ్వర్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత 2001లో పద్మశ్రీ కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+