ఇండియన్‌గా పుట్టి, ఖతర్ జాతీయుడిగా..

ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ఆయనను భారత పికాసోగా పిలుస్తారు. 1970లో గీసిన ఆయన చిత్రాలను 1996లో వివాదం చేశారు. హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆయనపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. చట్టపరమైన కేసులతో, నిరంతర బెదిరింపులతో తనంత తాను హుస్సేన్ 2006లో దేశాన్ని వదిలిపెట్టారు. ఖతర్ 2010లో ఇచ్చిన ఖతర్ పౌరసత్వాన్ని స్వీకరించారు. హరిద్వార్ జిల్లా కోర్టు సమన్లకు ఆయన స్పందించలేదు. దీంతో ఆయన ఆస్తులను జప్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాదులో ఆయనకు ఓ ఇల్లు కూడా ఉంది. తరుచుగా ఆయన హైదరాబాద్ వచ్చి వెళ్తుండేవారు. పలు అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అందుకున్న హుస్సేన్ చిత్రాలకు ఇండియాలో మిగతా చిత్రకారుల చిత్రాల కన్నా ఎక్కువ ధర పలికింది. ఆయన మాధురీ దీక్షిత్‌తో గజ గామిని సినిమా తీశారు. మీనాక్షి - ఓ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ సినిమాలు కూడా తీశారు.
తన 92 ఏళ్ల వయస్సులో ాయన కేరళ ప్రభుత్వం నుంచి రాజా రవి వర్మ అవార్డు అందుకున్నారు. అత్యంత ప్రభావవంతులైన 500 మంది ప్రపంచ ముస్లింల్లో ఆయన పేరు కూడా ఉంది. భారతదేశంలో హుస్సేన్‌కు హేతువాదుల, వామపక్ష వాదుల మద్దతు ఉన్నప్పటికీ చేయాల్సినం చేయలేకపోయారు. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడిని భారత్ వదిలేసుకుందనే చెప్పాలి.












Click it and Unblock the Notifications