దాసరి ఎపిసోడ్: చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు

Chiranjeevi-Mohan Babu
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య పాత పగ మళ్లీ కొత్తగా రగులుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల వీరిద్దరు చేతులు కలిపి భాయ్ భాయ్ అనుకున్నారు. ఇంతలోనే మళ్లీ పొరపొచ్చాలు వచ్చాయి. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావుపై చేసిన వ్యాఖ్యలు మోహన్ బాబును చిర్రెత్తించాయని అంటున్నారు. కొందరికి శరీరాలు కదలవు గానీ మాటలు బాగానే వస్తాయని రామ్ చరణ్ తేజ ఇటీవల ట్విట్టర్‌లో దాసరి నారాయణరావును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అదే మళ్లీ చిరు, మోహన్ బాబు కుటుంబాల మధ్య చిచ్చుకు కారణమైందని అంటున్నారు.

నాగయ్య అవార్డును అందుకున్న సభలో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజను ఉద్దేశించి చేసినవేనని అనుమానిస్తున్నారు. ఇప్పటి హీరోలకు నటనే రాదని ఆయన మండిపడ్డారు. పైరవీలు చేసుకుంటే, డబ్బులు పెడితే అవార్డులు వస్తాయని ఆయన దుమ్మెత్తిపోశారు. నంది అవార్డు అయినా సరే పైరవీతో వచ్చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్‌ తేజను ఉద్దేశించి అన్నవేనని అనుకుంటున్నారు. అయితే, మోహన్ బాబు ఇద్దరు కుమారులు కుమారులు కూడా హీరోలుగా సినీ రంగంలో ఉన్నారు. తన కుమారులను ఉద్దేశించి మోహన్ బాబు అంత మాట అంటాడని ఎవరూ అనుకోరు. అయితే, రామ్ చరణ్ తేజనో, చిరంజీవి కుటుంబ సభ్యులనో ఉద్దేశించి అన్నట్లు కాకుండా ఇప్పటి అందరు హీరోలకు నటన రాదని మోహన్ బాబు అన్నారు.

దాసరి నారాయణ రావును మోహన్ బాబు గురువుగా భావిస్తారు. అంతటి దాసరి నారాయణ రావుపై మగధీర వ్యాఖ్యలు చేయడం మోహన్ బాబుకు ఆగ్రహం తెప్పించినట్లు చెబుతున్నారు. అందుకే, ఆయన పరోక్షంగా రామ్ చరణ్ తేజపై విరుచుకుపడినట్లు చెబుతున్నారు. దాసరి నారాయణ రావుపై రామ్ చరణ్ తేజ ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయాల్లో తన తండ్రి చిరంజీవికి దాసరి నారాయణ రావు ఏమైనా అడ్డుపడుతున్నారా, అందుకే దాసరిపై రామ్ చరణ్ తేజ అసహనం వ్యక్తం చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+