గవర్నమెంట్ కంట్రోల్‌లో అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డ్..?

ఇక వివరాల్లోకి వెళితే సోమవారం క్రీడల శాఖ మంత్రి అజయ్ మాకెన్ మాట్లాడుతూ క్రీడా విభాగంలో కొత్తగా మార్పులు చేయనున్న సందర్బంలో దేశం మొత్తం మీద కలిపి 'నేషనల్ స్పోర్ట్స్ బిల్'ని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ బిల్‌ని మాన్ సూన్ సీజన్‌లో పెట్టి దానికి ఆమోదం తెలిపేలా చేయడం జరుగుతుంది. ఒకసారి ఆమోదం తెలిపిన తర్వాత దానిని పార్లమెంట్లో తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ నేషనల్ స్పోర్ట్స్ బిల్ గురించి మంగళవారం కేబినెట్ మీటింగ్ చర్చించి దేశంలో ఉన్న అన్ని రకాల నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌కి కొన్ని రెగ్యులేటరీ విధులను విధించడం జరుగుతుంది. ఈ విధులను దేశంలో ఉన్న నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్‌తో పాటు, బిసిసిఐ కూడా తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ బిల్ గనుక పాస్ ఐతే దేశంలో ఉన్న క్రికెటర్స్ అందరూ కూడా దేశంలో ఉన్న యాంటీ డోపింగ్ బాడీ అయిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ముందు డోపింగ్ టెస్టులకు హాజరవ్వాల్సి ఉంటుంది.
ఈ బిల్‌లో 25శాతం సీట్లు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రిజర్వేషన్ ఎవరికి వర్తిస్తుందంటే గతంలో క్రికెట్ నుండి రిటైర్ అయిన మాజీలు కొన్ని రోల్స్ పాటించగా, వీరితో పాటు రాజకీయనాయకులు కూడా మేజర్ రోల్ పోషించనున్నారు. ఈ బిల్‌లో ఉన్న రూల్స్ అన్ని కూడా ఇండియన్ ఒలంపిక్ అసోషియేషన్ కూడా వర్తిస్తాయి.












Click it and Unblock the Notifications