డిఎల్ఎఫ్‌ను నమ్మించి మోసం చేసిన పివిఆర్ ఓనర్?

ఈలోగానే లీజు పత్రంలో ఉన్న 33 సంవత్సరాలను గుప్తా కంపెనీ 99 సంవత్సరాలుగా మార్చి అభివృద్ధి పనుల పేరిట డిఎల్ఎఫ్ నుంచి రూ.280 కోట్లు తీసుకుంది. ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయం పూర్తయినా అభివృద్ధి పనులు చేపట్టక పోవడంతో డిఎల్ఎఫ్ సంస్థ పలుమార్లు ఆయన కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు వారు స్పందించలేదు. దీంతో డిఎల్ఎఫ్ సంస్థ తమకు తాకట్టు పెట్టిన గుప్తా కంపెనీ భూముల, ప్లాట్ల వివరాలు సేకరించగా వాటన్నిటినీ అప్పటికే ఇతరులకు అమ్మేసినట్లు బయటపడింది. కొన్ని భూములు వీరికి చెందినవే కాదని తేలింది. గుప్తా తమను మోసగించినట్లు స్పష్టం కావడంతో డిఎల్ఎఫ్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. గుప్తాకు చెందిన వివిధ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న గౌరీ శంకర్ గుప్తా, గోపాల్ గుప్తా, రాధేశ్యాం గుప్తా, మనోజ్ కుమార్ శర్మ, అమిత్ అగర్వాల్, సరితా గుప్తా, మేఘా గుప్తా, కోమల్ అగర్వాల్, మాంగ్రి గుప్తాలపై డిఎల్ఎఫ్ డిప్యూటీ మేనేజర్(లీగల్) సురేష్ కృష్ణ సిసిఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా గుప్తా కంపెనీల ప్రతినిధులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడంతో అది రాకుండా చూడడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారెవరూ దేశం దాటి పోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications