కొత్త రాజధాని ఖర్చు రూ. 2.5 లక్షల కోట్లు
హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం ప్రకటించింది. అయితే, ఈలోగా సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ కన్నా మంచి రాజధానిని సీమాంధ్రకు నిర్మించడానికి సహకరిస్తాని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా అంటున్నారు. అయితే, రాజధాని నిర్మాణం ఆషామాషీ వ్యవహారం కాదని అర్థమవుతోంది.
సరైన మౌలిక వసతులతో రాష్ట్ర రాజధానిని నిర్మించాలంటే రూ.2.5 లక్షల కోట్లు ($4.16 trillion dollars) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. సీమాంధ్ర రాజధాని కోసం ప్రస్తుతం ఉన్న ఏదో ఒక నగరానికి సమీపంలో కొత్త నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నయాపూర్ రాయపూర్, గాంధీనగర్, భువనేశ్వర్ మాదిరిగా ప్రణాళికాబద్దమైన నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

విభజనకు ముందే రాజధాని నగరం మౌలిక వసతులతపై ఐఐటి ఢిల్లీ నిపుణులు, హైదరాబాదుకు చెందిన వాడ ఫౌండేషన్ నిపుణలు కలిసి అధ్యయం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కనీస సుదీర్ఘ కాల పెట్టుబడి రూ.2.5 లక్షల కోట్లు ($4.16 trillion dollars) అవసరమవుతాయని వారు అంచనా వేసినట్లు చెబుతున్నారు. ప్రధానంగా కావాల్సింది విస్తారమైన రవాణా సౌకర్యాలు. అంతర్జాతీయ విమానాశ్రయం, రోడ్డు రవాణా వ్యవస్థ, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాలకు అనుసంధానం చేసే వ్యవస్థ అవసరమని భావిస్తున్నారు.
రైళ్లు, బస్సులు అత్యంత అవసరమని వాడా వ్యవస్థాపకడు పి. సురేష్ రాజుచెప్పినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది. పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ గ్రిడ్స్, బ్యాకప్ సరఫరా సౌకర్యాలు, భూగర్భ మురికినీటి పంపిణీ, మంచినీటి పంపిణీ లైన్లు, ఘన పదార్థాల నిర్వహణ సౌకర్యాల వంటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అధ్యయన నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పించనున్నట్లు సమాచారం. హైదరాబాదు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి యేటా 5 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని హెచ్‌ఎండిఎ ఏర్పాటు చేసిన సమగ్ర రవాణా వ్యవస్థ అధ్యయనం తెలిపింది.












Click it and Unblock the Notifications