భారత సైన్యం: మలాలాకు తాలిబన్ల లేఖలో గాంధీజీ

మహమ్మద్ ప్రవక్త బోధనల నుంచి నువ్వు నేర్చుకున్న ప్రేమ.. కరుణ భావానలను పాకిస్తాన్ సైన్యం కూడా అలవర్చుకోవాలని, అప్పుడే ముస్లింల రక్తపుటేరులు ప్రవహించకుండా ఉంటాయని అందులో పేర్కొ న్నారు. ఏసుక్రీస్తు బోధనల సారాంశాన్ని అమెరికా, నాటో దేశాలు అనుసరించాలని రాశారు. గౌతమ బుద్ధుడి బోధనలను ఆయన భక్తులు ఆచరించాలని, అలాగే భారత సైన్యం ఆ దేశ జాతిపిత గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని రషీద్ తన లేఖలో ప్రస్తావించడం ఆశ్చర్యకరం.
కాగా మలాలాను తిరిగి పాకిస్తాన్ వచ్చేయాల్సిందిగా తాలిబన్ల ప్రతినిధి రషీద్ ఆమెకు లేఖ రాసిన విషయం తెలిసిందే. మలాలా వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నానని, తన వూరికి వచ్చి చేరువలో ఉండే ఏదైనా ఆడపిల్లల మదర్సాలో చేరాలని, అల్లా గ్రంథాన్ని చదువుకోవాలని, ఇస్లాం.. ముస్లింల ఆవేదనను ప్రపంచానికి తెలియజేయడానికి తన కలం బలాన్ని ఉపయోగించాలని రషీద్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖలో రెండు వేలకు పైగా పదాలున్నాయి. మలాలాపై దాడిని రషీద్ సమర్థించుకున్నాడు. తాలిబన్ వ్యతిరేక ప్రచారంలో మలాలా భాగస్వామి అయ్యారన్నాడు. మలాలా పాఠశాలకు వెళ్తోందని, చదువును ప్రేమిస్తోందని తాము దాడి చేయలేదని, చదువు కోవడాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నాడు.
అయితే ఉద్దేశ్యపూర్వకంగా తాలిబన్లకు వ్యతిరేకంగా రాతలు రాస్తున్నట్లు విశ్వసించామని, స్వాత్‌లో ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేసే తమ ప్రయత్నాలను అపఖ్యాతి చేసే ప్రచారాలకు పాల్పడిందని, ఆ మాటలు, రాతలు తమను కవ్వించేలా ఉన్నాయన్నారు. ఐక్యరాజ్య సమితిలో మలాలా చేసిన ప్రసంగం శత్రువుల చేతిలో కీలుబొమ్మలా మారినట్లుగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications