బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడ్డారు: బాబు చలించారు

విజయవాడ: చిత్తూరు జిల్లా మొలకలచెరువు మండలంలోని ఆర్ఎస్ కొత్తపల్లే గ్రామానికి చెందిన 9 నెలల పసిపాప జ్ఝానసాయికి అనుకోని కష్టం వచ్చి పడింది. ఆ పాప కష్టం చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడదు చలించిపోయారు. ఆ చిన్నారిని ఆదుకోవడానికి ఎన్ని డబ్బులైన వెచ్చించడానికి ఆయన సిద్ధపడ్డారు.

నిరుపేద దంపతులు జె రమణప్ప, సరస్వతి కూతురు జ్ఝానసాయి. జ్ఞానసాయి పుట్టిన నాటి నుంచి కాలేయ సమస్యతో బాధపడుతోంది. వైద్య శాస్త్ర పరిభాషలో బిలిరియా అట్రాసియా అంటారు. చికిత్స కోసం ఇప్పటికే ఏడు లక్షలు ఖర్చు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో దంపతులు చివరికి బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడ్డారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించారు.

Chandrababu extends help to 9 months baby

అయితే ఈ వ్యవహారం తమ పరిధిలో లేదంటూ కోర్టు కేసు కొట్టేంది. ఈ వ్యవహారాన్ని శుక్రవారం మీడియా వెల్లడించడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చిన్నారి జ్ఞానసాయి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు బాలికకు అయ్యే వైద్య ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

గ్లోబల్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లను ఎంపిక చేసి చిన్నారికి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జ్ఞానసాయి వైద్యానికి కనీసం రూ.30 లక్షలు వ్యయం అవుతుందని బాలికను పరిశీలించిన వైద్యులు తెలియజేశారు. ఆ మొత్తాన్ని అందజేయాల్సిందిగా చంద్రబాబు అధికారులను సిఎం ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+