నిజమే!: పద్మాలయ భూములపై సిఫార్సు

దీనికి పద్మాలయ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో భూమిని వెనక్కి తీసుకోవాలని సిఫారసు చేస్తూ జిల్లా కలెక్టర్ ఎంకె మీనా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్ఏ)కు లేఖ రాశారు. స్టూడియో ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాల అనుమతులు రద్దు చేయాలని జిహెచ్ఎంసి), విద్యుత్తు, అగ్నిమాపక శాఖల అధికారులను కూడా కోరారు.
కాగా, సినీ రంగం అభివృద్ధి పేరిట స్టూడియో నిర్మాణం కోసం 1983లో పద్మాలయ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 9.5 ఎకరాలు కేటాయించింది. అప్పట్లో ఎకరాకు రూ.8,500 మాత్రం వసూలు చేసింది. భూమిని సినీ రంగ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలన్నది షరతు. కానీ, నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలు ఉన్నాయి.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు పద్మాలయ భూముల పైన నాలుగు రోజుల క్రితం కోర్టుకు ఎక్కారు. నిబంధనలకు విరుద్ధంగా పద్మాలయ భూములు అమ్మారని హరీష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications