Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ: బిత్తర చూపులే (పిక్చర్స్)

గుంటూరు: చెన్నై-హైదరాబాద్ మధ్య నడిచే 'చెన్నై ఎక్స్ ప్రెస్' రైలులో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు స్వైరవిహారం చేశారు. ఆరు బోగీల్లోని ప్రయాణికుల నుంచి నగలు, నగదుతోపాటు సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఐపాడ్‌లవంటి విలువైన సామగ్రిని దోచుకుపోయారు.

దుండగులు ఎస్-1, 5, 7, 9, 11, 12 బోగీల్లోకి ఎక్కి ప్రయాణికుల నుంచి 200 గ్రాముల బంగారం, 5 వేలకు పైగా నగదు, ఐప్యాడ్, మరికొన్ని వస్తువులు దోచుకున్నారు. ఈ మేరకు బాధితులు సికింద్రాబాద్‌లో ఫిర్యాదు చేశారు. ఇదంతా సుమారు 40 నిమిషాల పాటు సాగింది. దుండగులు తాపీగా రైలుదిగి వె ళ్లాక రైలు సికింద్రాబాద్ వైపు బయలుదేరింది.

ప్రతిరోజు రైల్వే పోలీసులు గుంటూరు నుంచి నడికూడి వరకు రైళ్లల్లో భద్రత కల్పించాల్సి ఉండగా సోమవారం భద్రతా సిబ్బంది చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి పిడుగురాళ్లలో దిగినట్లు సమాచారం. తెల్లవారుజామున సికింద్రాబాద్ చేరుకున్న బాధితులు అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుంటూరు రైల్వే అధికారులు మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని సందర్శించారు.

రైళ్లలో ప్రయాణికులను బెదిరిస్తూ దోపిడీకి పాల్పడే వారిపై కాల్పులకు వెనుకాడేది లేదని రైల్వే ఎస్పీ సీహెచ్ శ్యాంప్రసాద్ తెలిపారు. మంగళవారం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి గురైన ఘటనా స్థలాన్ని శ్యాంప్రసాద్ సందర్శించారు. ప్రతి రైలులో రాత్రిపూట డ్యూటీలో సిబ్బంది ప్రయాణి కులకు రక్షణగా ఆయుధాలు ధరించి ఉండాలని ఆయన సూచించారు.

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 1

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 1

చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత దోపిడీ జరిగింది. బాధితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 2

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 2

రైల్లో ప్రయాణిస్తున్న ఓ దుండగుడు గుంటూరు జిల్లా నడికుడి- పిడుగురాళ్ల మధ్య తుమ్మలచెరువు స్టేషన్ సమీపాన చైన్ లాగడంతో రైలు ఆగిపోయిందని బాధితులు చెప్పారు. అప్పటికే ఆ ప్రదేశంలో మాటువేసిన కొందరు దొంగలు బోగీల వద్దకు చేరుకున్నారు.

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 3

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 3

దుండగుల్లో ముగ్గురేసి చొప్పున ఒకరి భుజాలమీద మరొకరు ఎక్కి, కిటికీవైపు బెర్తులలో నిద్రిస్తున్న మహిళల మెడల్లోని ఆభరణాలను తెంచుకున్నారు. ఈ రకంగా ఆరు బోగీలలోని ప్రయాణికులను వారు దోచుకున్నారని బాధితులు చెప్పారు.

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 4

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 4

మరో ఇద్దరు, ముగ్గురు దొంగలు బోగీల్లో ఎక్కి నిద్రలో ఉన్న మహిళల తలకింది బ్యాగులను లాక్కుపోయారని, ఉక్కబోత ఫలితంగా చాలామంది కిటికీలు తెరచిపెట్టి నిద్రించడంతో దొంగలు కొద్దిక్షణాల్లోనే తమ పని ము గించుకుని పారిపోయారని బాధితులు చెప్పారు.

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 5

చెన్నై ఎక్స్‌ప్రెస్ దోపిడీ 5

గుంటూరు నుండి నడికూడి వరకు వెళ్లాల్సిన భద్రతా సిబ్బంది ఇటీవల కాలంలో పిడుగురాళ్ల నుండి వెనక్కి రావడం తన దృష్టికి వచ్చిందని ఎస్పీ శ్యాంప్రసాద్ తెలిపారు.

బిక్కుబిక్కు ఇలా..

బిక్కుబిక్కు ఇలా..

దోపిడీ జరిగిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు బిక్కు బిక్కుమంటూ కనిపించారు. ఓ పాప ఇలా దిక్కులు చూస్తూ...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+